లేటు వయసులో మేకప్ మాయ…

యవ్వంగా కనిపించేలా మేకప్ వేసుకుని నిత్య పెళ్లి కూతురు అవతారం. మూడు పెళ్లిళ్లు చేసుకుని ముగ్గురిని బురిడీ కొట్టించిన శరణ్య అలియాస్ సుకన్య అలియాస్ సంధ్య . మ్యారేజ్ బ్రోకర్ ల సాయంతో యువకులను మొగ్గులోకి దింపి పెళ్ళిళ్ళు. మొదట భర్త రవ తో విడాకులు తీసుకొని 10 లక్షలు కాజేసిన సుకన్య. ఆ తర్వాత సంధ్యగా పేరు మార్చుకుని సుబ్రహ్మణ్యంతో రెండో పెళ్లి. శరణ్య గా మళ్లీ పేరు మార్చుకుని పుత్తూరుకు చెందిన హరి అనే సాఫ్ట్ వేర్ ఇంజనీర్ తో మూడో పెళ్లి.

ఐదు పదులు దాటిన వయసులోనూ మేకప్ తో పడుచు యువతిలా మారి యువకులకు బురిడీ . మూడో భర్త హరిపై సైతం వరకట్న వేధింపులు కేసు నమోదు చేసి తీవ్ర ఇబ్బందులకు గురిచేసిన నిత్య1 పెళ్లికూతురు. చివరకు తన భార్య బండారం బట్టబయలు చేసిన మూడో పెళ్లి కొడుకు హరి. భార్య ఆధార్ కార్డు చూసి, ఆమె వయసు 54 అని తెలుసుకొని నిర్ధాంతపోయిన హరి. శరణ్య మోసంపై పోలీసులను ఆశ్రయించిన బాధిత హరి కుటుంబం. చెన్నైలోని ఆవడిలో చీటింగ్ కేసు నమోదు. పుత్తూరు పోలీసుల సాయంతో శరణ్యను అదుపులోకి తీసుకుని జైలుకు తరలించిన తమిళనాడు పోలీసులు.