మలయాళ ముద్దుగుమ్మ మాళవిక మోహనన్ ఇప్పటి వరకు టాలీవుడ్ లో ఒక్క సినిమా చేయకున్నా కూడా సోషల్ మీడియాలో అందాల ఆరబోత ఫోటోలు షేర్ చేయడం ద్వారా ఇక్కడ కూడా మంచి పాపులారిటీని సొంతం చేసుకుంది. ఆ పాపులారిటీ కారణంగానే ప్రభాస్ కి జోడీగా రాజాసాబ్ సినిమాలో నటించే అవకాశం దక్కించుకుంది. తమిళ మరియు హిందీ సినిమాల్లో నటిస్తూ ఇప్పటికే స్టార్ హీరోయిన్ క్రేజ్ దక్కించుకున్న మాళవిక మోహనన్ సోషల్ మీడియాలో మరోసారి అందాల ఆరబోత ఫోటోలు షేర్ చేసి చూపు తిప్పుకోనివ్వలేదు. ఈ స్థాయి అందం మాళవిక కి మాత్రమే సొంతం, సాధ్యం అన్నట్లు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా బికినీ లో స్టైలిష్ గా ఫోటోలకు ఫోజ్ ఇచ్చింది. సముద్రపు అందాలను షేర్ చేయడంతో పాటు తన బికినీ సెల్ఫీ అందాలను షేర్ చేసిన మాళవిక మోహనన్ కుర్రకారుకు పిచ్చెక్కిస్తుంది. ఓ రేంజ్ లో అందాల ఆరబోత ఫోటోలు షేర్ చేస్తున్న మాళవిక ఈసారి అంతకు మించి అన్నట్టు అందంగా ఉందని కొందరు అంటున్నారు. టాలీవుడ్ లో ప్రస్తుతం ప్రభాస్ తో చేస్తున్న రాజా సాబ్ సినిమా హిట్ అయితే కచ్చితంగా ముందు ముందు తెలుగు స్టార్ హీరోలకు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అవ్వడం ఖాయం. మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా పై అంచనాలు భారీగా ఉన్నాయి. వచ్చే ఏడాదిలో రాజా సాబ్ వచ్చే అవకాశాలు ఉన్నాయట.