వెండితెర వెన్నెల… మంజుల

కొండల్లే నేనున్నాను
గుండె పగలక..
మంచల్లే నువ్వెళ్ళావు మనసు తెలియక..

ఆ శోభన్ బాబు..
ఆ మంజుల..
వెండితెర వెన్నెల..
నువ్వెళ్ళావు..నేనున్నాను
అనుకున్నా అటూ ఇటుగా
ఇద్దరూ వెళ్లారు..
మనసు జారిపోతే గాని
కాలు జారదు కన్నెపిల్ల..
పడుచువాడది తెలియకుండా..
ఒడిని పట్టి లొట్టలేస్తే..
ఇలా ఒకరినొకరు
ఏడిపించుకుంటూ..
అప్పుడప్పుడూ విడిపోయి
ప్రేక్షకుల్ని ఏడిపిస్తూ..!

నిన్నే పెళ్ళాడుతా..
రాముడు భీముడు
రాముని మించిన రాముడు
ఎదురుగా తెల్లని బట్టల్లో
అందగాడు ఎన్టీఆర్..
అతడిని మురిపిస్తూ
అద్భుతమైన నృత్యం..
మంజుల..
ఒక చెదరిపోయిన కల!

నేనీ దరిని నువ్వా దరిని
కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ..
మనమంటే
తనకెంతో ముద్దని..
అక్కినేనినీ మురిపించింది..
జనాల్ని మైమరపించింది
మంజుల.. ఎగసిపడిన
అందమైన అల..!

తలకి నీళ్లోసుకుని..
కురులారబోసుకుని
నిలుచుంటే..నువు నిలుచుంటే
నా మనసు
నిలువకున్నది..
ఎంత రమ్మన్నా..
నిన్నొదిలి రాకున్నది..
మాయదారి మల్లిగాడుని
ఆడించిన..అల్లాడించిన చంద్రి..చంద్రబింబమే..
పంచె లాల్చీ..మెడ చుట్టూ రుమాలు..మల్లిగాడు
ఎంత మాయదారోడో..
ఈ చంద్రి
అంతకు మించిన సిసింద్రీ..
ఆ బొమ్మ హిట్టుకు
ఈ బంగారు బొమ్మ
పెద్ద కారణం…
మంజుల..నవ్వుతూ కిలకిల!

సురేష్ కుమార్ ఎలిశెట్టి
9948546286