Mahanaadu-Logo-PNG-Large

మే 31న వరల్డ్ వైడ్‌గా హిట్ లిస్ట్

తమిళ డైరెక్టర్ విక్రమన్ కొడుకు విజయ్ కనిష్క హీరోగా సముద్రఖని, శరత్ కుమార్, గౌతమ్ వాసుదేవ మీనన్ ముఖ్యపాత్రలో నటించిన సినిమా హిట్ లిస్ట్. సూర్య కతిర్ కాకల్లార్, కే. కార్తికేయన్ దర్శకత్వంలో ఆర్. కె. సెల్యులాయిడ్స్ పై డైరెక్టర్ కె. ఎస్. రవికుమార్ గారు నిర్మిస్తున్న సినిమా. గతంలో ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్లు సినిమా పైన అంచనాలను పెంచగా. నేడు ఈ సినిమాకి సంబంధించిన టీజర్ వెర్సటైల్ హీరో సూర్య చేతుల మీదగా లాంచ్ చేశారు.

యాక్షన్, సస్పెన్స్, క్రైమ్ జోనర్ లో వస్తున్న ఈ సినిమా టీజర్ ఇటీవలే విడుదలై ఆడియన్స్ ని ఆకట్టుకుంటోంది. కాగా నేడు ఈ సినిమా సంబంధించిన ట్రైలర్ లాంచ్ మరియు ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈవెంట్ కి ముఖ్య అతిథులుగా శ్రీ మురళీమోహన్ గారు, తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ గారు విచ్చేశారు. వీరితోపాటు నిర్మాత, దర్శకుడు కె. ఎస్. రవికుమార్ గారు, హీరో విజయ్ కనిష్క, దర్శకులు సూర్య కతిర్ కాకల్లార్, కే. కార్తికేయన్, తెలుగు రిలీజ్ నిర్మాతలు శ్రీనివాస్ గౌడ్ గారు మరియు బెక్కం రవీంద్ర గారు పాల్గొన్నారు.

శ్రీ మురళీమోహన్ గారు మాట్లాడుతూ : హీరో విజయ్ కనిష్క నాన్నగారు విక్రమన్ గారిని ఇన్స్పిరేషన్ గా తీసుకుని చిన్నప్పటి నుంచి ఇండస్ట్రీలో ఉండి మొదటి సినిమా అయినా చాలా అద్భుతంగా నటించాడు. నాకు బాగా సన్నిహితుడు కె. ఎస్. రవికుమార్ గారు ఈ సినిమాకి నిర్మాతక వ్యవహరించడం మంచి విషయం. ట్రైలర్ చాలా బాగుంది సినిమా ఖచ్చితంగా మన సక్సెస్ అవ్వాలని అవుతుందని కోరుకుంటున్నాను అన్నారు.

తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ గారు మాట్లాడుతూ : నన్ను ఈ సినిమా ప్రీ రిలీజ్ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు కె. ఎస్. రవికుమార్ గారికి టీం కి నా అభినందనలు తెలుపుతున్నాను. మంచి నిర్మాత దర్శకులు కె. ఎస్. రవికుమార్ గారు. విజయ్ కనిష్కకి ఈ సినిమా మంచి విజయం అవుతుందని టీమ్ అందరికీ మంచి సక్సెస్ అందించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.

నిర్మాత కె. ఎస్. రవికుమార్ గారు మాట్లాడుతూ : నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లో టెన్ ఇయర్స్ అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేస్తాను. 1990లో కుదు వసంతం సినిమాతో విక్రమన్ సార్ కి నాకు మంచి పరిచయం ఏర్పడింది. ఇప్పుడు విజయ్ కనిష్క ని నేను లాంచ్ చేయడం చాలా ఆనందంగా ఉంది. నేను తెలుగు తమిళ్ లో ఎంతోమంది పెద్ద హీరోలతో పని చేశాను. మే 31న ఈ సినిమాతో మీ ముందుకు వస్తున్నాం. కచ్చితంగా అందరికీ ఈ సినిమా నచ్చుతుంది అని ఆశిస్తున్నాను అన్నారు.

హీరో విజయ్ కనిష్క గా మాట్లాడుతూ : నాకు తెలుగు సరిగ్గా రాదు అయినా కూడా తెలుగు సినిమాలంటే చాలా ఇష్టం. మా అమ్మగారు తెలుగు నాన్నగారు తమిళ్ సో రెండు నాకు చాలా ఇష్టం. హిట్ లిస్ట్ మూవీ కథ నాకు బాగా నచ్చింది. ఈ సినిమాని తెలుగులో రిలీజ్ చేస్తున్న శ్రీనివాస్ గౌడ్ గారికి బిక్కం రవీంద్ర గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నా దర్శకులు సూర్య కతిర్ కాకల్లార్, కే. కార్తికేయన్ నాకు చాలా కంఫర్ట్ ఇచ్చి ఈ సినిమా చేయించారు. మా నాన్నగారు తమిళ్, తెలుగులో పెద్ద సినిమాలు తీసిన డైరెక్టర్ విక్రమన్ గారు. తెలుగులో మా నాన్నగారు మొదటగా తీసిన సినిమా వసంతం వెంకటేష్ గారితో మొదటి సినిమా అయిన ఆయనకు చాలా మంచి సపోర్ట్ ఇచ్చారు. నాకు కూడా ఈ సినిమాకి అదే సపోర్ట్ ఇస్తారని ఆశిస్తున్నాను. కచ్చితంగా ఈ సినిమా అందరికీ నచ్చుతుంది. ఈ సినిమా సక్సెస్ చేయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.

తెలుగు రిలీజ్ నిర్మాతలు శ్రీనివాస్ గౌడ్ గారు, బెక్కం రవీంద్ర గారు మాట్లాడుతూ : మమ్మల్ని సపోర్ట్ చేసే ఆశీర్వదించడానికి వచ్చిన మురళీమోహన్ గారికి తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. తెలుగులో మమ్మల్ని నమ్మి రిలీజ్ కి అవకాశం ఇచ్చిన కె. ఎస్. రవికుమార్ గారికి ధన్యవాదాలు. ప్రేక్షకులు ఈ సినిమాని మంచి సక్సెస్ చేయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.