మచిలీపట్నం, మహానాడు: మచిలీపట్నంలోని మూడు స్తంభాల కూడలిలో ఏర్పాటుచేసిన అన్న క్యాంటీన్ ను శుక్రవారం భూగర్భ గనులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలసౌరి, కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ఎంపీ కొనకళ్ళ నారాయణరావు, జనసేన మచిలీపట్నం నియోజకవర్గ ఇన్చార్జ్ బండి రామకృష్ణ, నాయకులు మోటమర్రి బాబా ప్రసాద్, గోపు సత్యనారాయణ, ఇలియాస్ పాషా, కుంచె నాని, పిప్పళ్ళ కాంతారావు, జనసేన నాయకులు, తెలుగుదేశం పార్టీ శ్రేణులు, ముఖ్య నాయకులంతా పాల్గొన్నారు.