ఎంఐజి లేఔట్‌ను పరిశీలించిన మంత్రి మండిపల్లి

రాయచోటి, మహానాడు: మధ్య తరగతి ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం నిర్మిస్తున్న ఎంఐజి లేఅవుట్‌ పనులు త్వరగా పూర్తి చేయాలని రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం రాష్ట్ర మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌ రెడ్డి సంబంధిత అధికారులతో కలిసి ఎంఐజి లేఔట్‌ ను పరిశీలించారు.

ఈ సందర్భంగా రాష్ట్ర రవాణా, యువజన క్రీడ శాఖ మంత్రి మందడిపల్లి రాంప్రసాద్‌ రెడ్డి మాట్లాడుతూ.. మధ్యతరగతి ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని నిర్మిస్తున్న ఎంఐజి లేఔట్‌ లో పనులు త్వరితగతను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. రాయచోటి పట్టణ పరిసర ప్రాంతం దిగువ అబ్బవరం దగ్గర నిర్మిస్తున్న ఎం ఐ జి లేఅవుట్‌ కు సంబంధించి అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ, పైప్‌ లైన్‌, రోడ్లు నిర్మాణం, వంటి పనులు వేగవంతం చేయాలన్నారు. ఎంఐజీ లేవుట్‌ తో పట్టణ ప్రాంతాల్లోని మధ్య తరగతి ప్రజల సొంతింటి కల నెరవేరుతుందని అధికారులు త్వరితగతిన లేఅవుట్‌ పనులు పూర్తి చేయాలన్నారు.