పలు సచివాలయాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన ఎమ్మెల్యే
గుంటూరు, మహానాడు : గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఎమ్మెల్యే గళ్ళ మాధవి శుక్రవారం సుడిగాలి పర్యటన చేశారు. పలు సచివాలయాలను సందర్శించి ప్రజలతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా 43వ డివిజన్లో ఉన్న 113 ,114 సచివాలయాలను సందర్శించగా సిబ్బంది అనేకమంది అందుబాటులో లేకపోవడంతో వారి మీద ఆగ్రహం వ్యక్తం చేశారు 43వ డివిజన్ లో శానిటేషన్ సమస్య అధికంగా ఉన్నదని మీ దృష్టికి రాలేదా అని వారిని ప్రశ్నించారు.
మాకు ఇళ్ల పట్టాలు ఇప్పించండని సుగాలి కాలనీవాసులు ఎమ్మెల్యే గళ్ళా మాధవిని కోరారు. 1 44వ డివిజన్ 137, 138 సచివాలయాలను ఎమ్మెల్యే గళ్ళా మాధవి సందర్శించారు. అరుంధతి నగర్ అప్పర్ ప్రైమరీ స్కూల్ ను సందర్శించి మధ్యాహ్మ భోజన పథకాన్ని పరిశీలించారు. 44వ డివిజన్ లో పలువురు పార్టీ కార్యకర్తలు చనిపోగా వారి పార్థివదేహానికి నివాళ్ళార్పించి, వారికి ఆర్థిక సహాయం అందజేశారు. 45వ డివిజన్ లోని ముత్యాల రెడ్డి నగర్ 1వ లైన్, ఎన్టీఆర్ కాలనీలను పరిశీలించారు.