గణనాథులకు ఎమ్మెల్యే విశేష పూజలు

గుంటూరు, మహానాడు: గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో పలు వినాయక మండపాల నిర్వాహకుల ఆహ్వానం మేరకు నియోజకవర్గంలోని మహర్షి దయానంద నగర్, సంపత్ నగర్, శ్రీనివాసరావు పేట, నాయీ బ్రహ్మణ కాలనీ, కల్యాణి నగర్, సాకేతపురం, నల్లచెరువు 15, 25 లైన్లు, బ్రాడిపేట 6/19, విద్యానగర్ 1,3వ లైన్లు, జే కే సి కాలేజీ ఓల్డ్ స్టూడెంట్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మండపాన్ని ఎమ్మెల్యే గళ్ళా మాధవి సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వినాయక చవితి నవరాత్రులలో భాగంగా ఏర్పాటు చేసిన అన్న సమారాధనలను ప్రారంభించారు.