తగ్గేదేలే..!

డైలాగులు చెప్పడంలో ఎన్టీఆర్ తర్వాత
మోహన్ బాబేనని
జీవించి లేని
అక్కినేని అన్నపూర్మమ్మని సాక్ష్యంగా పెట్టుకున్నాడు చూడండని
నటసామ్రాట్ చురకలు..

స్నేహితుడంటూ అంతలోనే
చిరంజీవిపై సెగలు..
డైలాగులు బాగా చెప్పేవాడైనా
అప్రస్తుతంగా..
అసందర్భంగా మాటాడితే..
పెద్దలు చెప్పినట్టు
నోరా వీపుకు తేకే..
వేపుకు తినకే..
అన్నట్టు కలెక్షన్ కింగ్ ప్రవర్తన
ఎన్నాళ్లయినా ఆ మడిసిలో
కనిపించని పరివర్తన..!

రౌడీమొగుడు..
రౌడీ గారి పెళ్ళాం..
అసెంబ్లీ రౌడీ..
ఇలా మోహన్ బాబులో ఎందరు రౌడీలున్నా
పెదరాయుడును మించినోడు లేడు..
సినిమాల్లో జింగిరిబింగిరి..
మీటింగుల్లో..
షూటింగుల్లో కిరికిరి..
సీనియర్ నటికీ
తప్పని అవమానం..
జరిగింది తప్పయినా
అన్న జోక్యంతో
తప్పిన ముప్పు..
దాసరి గురువని..
ఎన్టీఆర్ అన్నని
చెప్పుకుంటే చాలదు..
మర్యాద ఆ ఇద్దరితో తూగదు..!

సరే..క్యారెక్టర్ ఎలా ఉన్నా
క్యారెక్టర్లో దూరిపోయే నటుడు..విలనీ..
హీరోయిజం..కామెడీ..
ఏదైనా దుల్లగొట్టే శివన్న..
రాజీ పడని శివాజీ..,!

రాజకీయాల్లోనూ అదే ధోరణి
మారిపోయే బాణీ..
రూటే సెపరేటు..
దూకేస్తూ అటూఇటు..
లక్షణాలు ఎలా ఉన్నా
విలక్షణ నటుడు..
ఈ భక్తవత్సలం
సృష్టిస్తూ కలకలం..!

ఇ.సురేష్ కుమార్