పుష్కర కాలం క్రితం ఏ ఖామోషియాన్ అనే హిందీ సీరియల్ ద్వారా బుల్లితెరకు పరిచయం అయిన ముద్దుగుమ్మ మృణాల్ ఠాకూర్ 2014 లో విట్టిదండు అనే మరాఠి సినిమాతో వెండితెరకు పరిచయం అయ్యింది. అప్పటి నుంచి సినిమా ఇండస్ట్రీలో అడపాదడపా సినిమాలు చేస్తూనే ఉన్నా ఆశించిన స్థాయిలో గుర్తింపు రాలేదు. పదేళ్ల తర్వాత ఈ అమ్మడికి సీతారామం సినిమా తో ఒక్కసారిగా పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు దక్కింది. తెలుగు సినిమానే అయినా కూడా అన్ని భాషల ప్రేక్షకులకు మృణాల్ ను ఆ సినిమా దగ్గర చేసింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. హీరోయిన్ గా మృణాల్ ప్రస్తుతం సౌత్ లో ఫుల్ బిజీ బిజీగా సినిమాలు చేస్తుంది. తెలుగు లో సీతారామం, హాయ్ నాన్న సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ విజయాలను సొంతం చేసుకుంది. ఇటీవలే విజయ్ దేవరకొండతో కలిసి ఫ్యామిలీ స్టార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా ఫలితంతో సంబంధం లేకుండా మృణాల్ కి మళ్లీ మంచి పేరు వచ్చింది. కెరీర్ ఆరంభంలో మృణాల్ స్కిన్ షో విషయంలో హద్దులు పెట్టుకుని వ్యవహరించేది. కానీ ఇప్పుడు మాత్రం అలాంటి హద్దులు ఏమీ లేవు అన్నట్లుగా అందాల విందు చేస్తోంది. తాజాగా ఒక షో లో మృణాల్ పాల్గొని చేసిన అందాల విందుకు నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. నడుము నాభి అందాలను చూపిస్తూ క్లీవేజ్ షో తో మృణాల్ చేసిన షో కుర్రకారుకు ముచ్చెమటలు పట్టించింది అంటూ నెట్టింట కామెంట్స్ వస్తున్నాయి.