ఏపీలో మరో టీడీపీ నేతపై హత్యాయత్నం జరిగింది. పల్నాడు జిల్లా రొంపిచర్ల మండల టీడీపీ అధ్యక్షుడు వెన్నా బాలకోటిరెడ్డిపై కొందరు దుండగులు దాడి చేశారు. తన స్వగ్రామం అలవలలో మార్నింగ్ వాక్ కు బయల్దేరిన సమయంలో ఆయనపై దుండగులు గొడ్డళ్లతో దాడి చేసి పరారయ్యారు.
ఈ దాడిలో బాలకోటిరెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే ఆయనను స్థానికులు నరసరావుపేట ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. గతంలో బాలకోటిరెడ్డి రొంపిచర్ల ఎంపీపీగా కూడా ఉన్నారు. అయితే, ఆయనపై దాడి చేసింది ఎవరు? దాడికి గల కారణాలు ఏమిటి? అనే విషయాలు తెలియాల్సి ఉంది. టీడీపీ శ్రేణులు మాత్రం ఈ దాడికి పాల్పడింది వైసీపీ నేతలే అని ఆరోపిస్తున్నారు. ఈ దాడి నేపథ్యంలో ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.