‘నందనందనా..నందనందనా.. అంటున్న “ఫ్యామిలీ స్టార్”

స్టార్ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న “ఫ్యామిలీ స్టార్” సినిమా మ్యూజికల్ ప్రమోషన్స్ ప్రారంభమయ్యాయి. ఈ సినిమా నుంచి ఈ నెల 7వ తేదీన ఫస్ట్ సింగిల్ ‘నందనందనా..’ రిలీజ్ చేయబోతున్నారు. తాజాగా విడుదల చేసిన ఈ సాంగ్ ప్రోమో ఆకట్టుకుంటోంది. ‘నందనందనా..’ పాట ప్రోమోలో విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జాయ్ ఫుల్ మూడ్ లో కనిపిస్తున్నారు. విజయ్ దేవరకొండ, దర్శకుడు పరశురామ్ పెట్ల సూపర్ హిట్ మూవీ “గీత గోవిందం”లో ఛాట్ బస్టర్ సాంగ్ ‘ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే…’కు వర్క్ చేసిన లిరిసిస్ట్ అనంత్ శ్రీరామ్, సింగర్ సిధ్ శ్రీరామ్, మ్యూజిక్ డైరెక్టర్ గోపీ సుందర్ కాంబోలో ‘నందనందనా..’ సాంగ్ వస్తుండటంతో ఈ పాటపై బజ్ క్రియేట్ అవుతోంది.

“ఫ్యామిలీ స్టార్” సినిమాను ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో స్టార్ ప్రొడ్యూసర్స్ దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. హోల్ సమ్ ఎంటర్ టైనింగ్ డైరెక్టర్ పరశురామ్ పెట్ల రూపొందిస్తున్నారు. “ఫ్యామిలీ స్టార్” చిత్రానికి క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా వాసు వర్మ వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాను ఏప్రిల్ 5వ తేదీన గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకురాబోతున్నట్లు రీసెంట్ గా మేకర్స్ అనౌన్స్ చేశారు. ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన “ఫ్యామిలీ స్టార్” సినిమా సూపర్ హిట్ అవుతుందనే పాజిటివ్ టాక్ ఇప్పటికే మొదలైంది.