సూపర్ టాలెంటెడ్ యాక్టర్ నవదీప్ కొంత విరామం తరువాత హీరోగా, సరికొత్తగా నవదీప్ గా 2.Oగా కనిపించబోతున్న చిత్రం లవ్,మౌళి. విభిన్నమైన, వైవిధ్యమైన ఈ చిత్రానికి అవనీంద్ర దర్శకుడు. ఈ చిత్రాన్ని నైరా క్రియేషన్స్ మరియు శ్రీకర స్టూడియోస్ బ్యానర్స్ తో కలిసి నిర్మాణ పనులు టాలీవుడ్ టాలెంటెడ్ టెక్నిషియన్స్ కి అడ్డాగా మారిన సి స్పేస్ భాధ్యతలు తీసుకుంది. ఈ చిత్రం నుంచి వచ్చిన ప్రతి అప్‌డేట్ వినూత్నంగా అందరిని ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్రం నుంచి షీ ఈజ్ రియల్ అనే లిరికల్ వీడియోను విడుదల చేసింది చిత్రయూనిట్. గోవింద్ వసంత్ స్వరాలు అందించిన ఈ చిత్రానికి అనంత్ శ్రీరామ్ సాహిత్యాన్ని అందించారు. శరత్ సంతోష్, జిబా టామీ ఆలపించారు. సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన నవదీప్ లుక్‌తో పాటు విడుదలైన ద ఏంతమ్ ఆఫ్ లవ్ మౌళి సాంగ్‌కు, హీరో టీజర్‌కు మంచి స్పందన వచ్చింది.ఈ చిత్రంలోచాలా డిఫరెంట్‌గా నవదీప్ కనిపించడంతో ఈ సినిమా నవదీప్ 2.Oగా అభిమానులంతాఒక ఢిఫరెంట్ కాన్నెప్ట్ తొ వుంటుందని మంచి అంచనాలతో ఈ సినిమా గురించి ఎదురుచూస్తున్నారు. నేడు విడుదలైన పాటలను చూస్తుంటే వీరి అంచనాలను మరింత పెంచే విధంగా వుంది. ఎందుకుంటే నవదీప్‌ను సరికొత్తగా చూసిన వాళ్లంతా ఈసినిమాతో ఆయన కొత్త ట్రెండ్ క్రియేట్ చెయ్యబోతున్నాడని అంటున్నారు. నా లైఫ్ లో జరిగిన ప్రేమకథలకు ఫలితమే ఈ సినిమా కథ. నేను పాన్ ఇండియా లెవల్‌లో ప్రేమించేవాడ్ని. ప్రేమ అనే టాపిక్‌లో సో మెనీ వెరియేషన్స్ వున్నాయి. నా స్వీయ అనుభవాలే ఈ సినిమా కథ అన్నారు.