కోలీవుడ్ లో పాపులరైన మాళవిక మోహనన్ రాజా సాబ్ చిత్రంతో టాలీవుడ్ లో అడుగుపెడుతున్న సంగతి తెలిసిందే. బహుభాషల్లో రాణించాలని తపన పడుతోంది ఈ బ్యూటీ. ఆస్కార్ నామినేటెడ్ ఫిల్మ్ మేకర్ మజిద్ మజిదీ దర్శకత్వం వహించిన థ్రిల్లర్ `బియాండ్ ది క్లౌడ్స్` (2017)లో తన అద్భుత నటనతో అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించిన మాళవిక ఇటీవల కమర్షియల్ చిత్రాల్లో నటిస్తోంది. ఫిలింఫేర్ ఉత్తమ డెబ్యూ అవార్డు సహా స్టార్ స్క్రీన్ అవార్డ్స్‌లో ఉత్తమ నటి (క్రిటిక్స్) పురస్కారాలు గెలుచుకుంది. అలాగే సూపర్ స్టార్ రజనీకాంత్‌తో పెట్టా (2019) నుండి వాణిజ్యపరంగా విజయవంతమైన అనేక తమిళ చిత్రాలలో నటించింది. `యుధ్రా` చిత్రంతో హిందీలోకి అడుగుపెట్టనుంది. ప్రభాస్ సరసన రాజాసాబ్ తెలుగులో తన తొలి చిత్రం. ఇది ఇంకా విడుదలకు రావాల్సి ఉంది. మాళవిక ఇన్నేళ్ల విజయవంతమైన కెరీర్ గురించి ప్రస్థావిస్తూ… విజయానికి తాను పటించే మంత్రాన్ని అభిమానుల కోసం షేర్ చేసుకుంది. జయాపజయాలను బ్యాలెన్స్ చేయడం.. మీకు మీరే నిజాయితీగా ఉండటం.. మిమ్మల్ని జీవితాంతం సజీవంగా ముందుకు తీసుకువెళుతుంది“ అని మాళవిక వ్యాఖ్యానించింది. తాజాగా ది వర్డ్ మ్యాగజైన్ కవర్ షూట్ లో పాల్గొన్న మాళవిక వైట్ అండ్ వైట్ డిజైనర్ లుక్ లో కనిపించి ఆశ్చర్యపరిచింది. సాంప్రదాయం మేళవించిన వెస్ట్రన్ స్టైల్ ఈ డిజైనర్ లుక్ లో కనిపించింది. `బ్రిడ్జర్టన్` సీజన్ 3 మాళవిక మోహనన్ నటించిన తాజా వెబ్ సిరీస్. ఈ సీజన్‌పై మాళవిక తన అసంతృప్తిని బహిరంగంగా వ్యక్తం చేసింది. అభిమానుల అంచనాలను అందుకోలేకపోవడం తనని నిరాశపరిచిందని తెలిపింది. అత్యున్నతమైన డ్రామా రొమాన్స్ ని ప్రజలు ఆశించారు. కానీ ఇది రొటీన్ డ్రామా సిరీస్ గా నిలిచిందని నిరాశచెందారు.