సౌత్ స్టార్ హీరోయిన్స్ లో ఒకరైన సమంత తను చేసే ఎలాంటి పాత్రతో అయినా ప్రేక్షకులను మెప్పిస్తుంది. ఏమాయ చేసావె సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన సమంత అప్పటికీ ఇప్పటికీ సినిమాలో ఆమె పాత్రకు పూర్తి స్థాయిలో న్యాయం చేస్తూ క్రేజ్ కొనసాగిస్తుంది. మధ్యలో మ్యారేజ్ ఆ తర్వాత డైవర్స్ మళ్లీ మయోసైటిస్ వల్ల కెరీర్ కాస్త వెనుక పడినట్టు అనిపించినా ఎంత వెనక్కి వెళ్తుంతే అంతే వేగంతో దూసుకొస్తుంది అమ్మడు. ప్రస్తుతం సమంత బాలీవుడ్ లో సిటాడెల్ సీరీస్ ని పూర్తి చేసింది. ఈమధ్యనే తన సొంత బ్యానర్ లో బంగారం సినిమా ప్రకటించింది అమ్మడు. నటిగానే కాదు ఇక మీదట నిర్మాతగా కూడా పరిశ్రమకు తన వంతు సహకారం అందించేందుకు సిద్ధం అంటుంది సమంత. అయితే బంగారం సినిమా కోసమే తను మార్షల్ ఆర్ట్స్, ఆర్చరీ, కత్తిసాము, గుర్రపు స్వారీ లాంటివి నేర్చుకుంటుందని తెలుస్తుంది. ఇదే విషయం గురించి సమంత రీసెంట్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. చిత్ర పరిశ్రమలో ప్రతి సినిమాకు ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉంటాం.. అంతేకాదు సినీ కెరీర్ మొదలు పెట్టి 15 ఏళ్లు అవుతున్నా కూడా ఇప్పటికీ కొత్తగానే ఉంది. సినిమాలో ఉన్న లాజిక్కే అదని అంటుంది సమంత. సమంత కెరీర్ గురించి ఎన్ని డౌట్లు రేజ్ అయినా అమ్మడు మాత్రం మళ్లీ మళ్లీ తిరిగి ఫాంలోకి వస్తుంది. తన మీద వచ్చే వార్తలకు.. ట్రోల్స్ కి అసలు ఏమాత్రం తగ్గకుండా తన సినిమాలతో సమాధానం చెబుతుంది సమంత. అలా తగ్గితే అది సమంత ఎలా అవుతుందని ఆమె ఫ్యాన్స్ కూడా అంటుంటారు. మరి సమంత నుంచి రాబోతున్న బంగారం సినిమా ఆమెకు ఒక మంచి కంబ్యాక్ ఇస్తుందేమో చూడాలి.