బీఆర్ఎస్ లో నోముల ప్రకాశ్ రావు

– భారీగా సికింద్రాబాద్ కాంగ్రెస్ నుంచి చేరికలు
– పద్మారావు గౌడ్ నేతృత్వంలో బీఆర్ ఎస్ తీర్ధం పుచ్చుకున్న నోముల ప్రకాశ్ రావు, బ్లాక్ అధ్యక్షులు, డివిజనల అధ్యక్షులు
– సాదరంగా స్వాగతం పలికిన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

సికింద్రాబాద్ : సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం లో కాంగ్రెస్ పార్టీ కి పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. పీ సి సి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సికింద్రాబాద్ లో రోడ్ షో నిర్వహించి, కాంగ్రెస్ పార్టీ శ్రేణులను ఉత్సాహ పరచేందుకు ప్రయత్నించి 24 గంటలు గడవక ముందే శుక్రవారం సికింద్రాబాద్ కాంగ్రెస్ పార్టీ కి చెందిన ముఖ్య నేతలందరూ మూకుమ్మడిగా బీ ఆర్ ఎస్ లో చేరారు. పార్టీని వీడిన వారిలో సీనియర్ నాయకుడు నోముల ప్రకాశ్ రావు తో పాటు సికింద్రాబాద్ కాంగ్రెస్ పార్టీ ఏ బ్లాక్ కమిటి అధ్యక్షుడు జగదీశ్వర్, బీ బ్లాక్ కమిటి అధ్యక్షుడు ప్రవీణ్ లాల్ కూడా ఉన్నారు.

తొలుత డిప్యూటీ స్పీకర్, సికింద్రాబాద్ అభ్యర్ధి తీగుల్ల పద్మారావు గౌడ్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత నోముల ప్రకాశ్ రావు ఆహ్వానం మేరకు శుక్రవారం ఉదయం సీతాఫలమండి లో ఆయన నివాసానికి వెళ్లారు. అక్కడే జగదేశ్వర్, ప్రవీణ్ లాల్ లతో పాటు సికింద్రాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ డివిజన్ల అద్యక్షులు, ఇతర ముఖ్య నేతలు సమావేశమయ్యారు. కాంగ్రెస్ పార్టీ లో ఏక పక్ష విధానాలు, అప్రజాస్వామిక పద్దతులతో విసిగి పోయామని, కెసిఆర్ నాయకత్వంలో బీ ఆర్ ఎస్ ను బలపరచాలని నిర్ణయించుకున్నామని తెలిపారు.

సికింద్రాబాద్ లో పద్మారావు గౌడ్ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పధకాలు, కార్యకర్తలతో సానిహిత్యం తదితర అంశాల పట్ల ఆసక్తిగా ఉన్నామని తెలిపారు. వెంటనే పద్మారావు గౌడ్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే టీ ఆర్ ను సంప్రదించి వారితో కలిసి కే టీ ఆర్ నివాసానికి చేరుకున్నారు. కే టీ ఆర్ ఈ సందర్భంగా వారికీ ఖండువాలు కప్పి పార్టీ లోకి సాదరంగా ఆహ్వానించారు. వారిని తగిన రీతిలో ప్రోత్సహిస్తామని తెలిపారు.

సికింద్రాబాద్ లో తమ పార్టీ విధానాలు, తమ వ్యక్తిగత వ్యవహార శైలితో వివిధ పార్టీల నాయకులు, తటస్తులు కూడా మద్దతు తెలుపుతున్నారని పద్మారావు గౌడ్ ఈ సందర్భంగా తెలిపారు. ఎన్నికల్లో పద్మారావు విజయానికి బేషరతుగా కృషి చేస్తామని నోముల ప్రకాశ్ రావు, జగదీశ్వర్, ప్రవీణ్ లాల్ తదితరులు పేర్కొన్నారు. పార్టీ లో చేరిన వారిలో సందీప్, వెంకట్ సాయి కుమార్, అడ్వకేట్ సునీల్, జలంధర్, శ్రీశైలం, శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.