వెలగపూడి : రాష్ట్ర ప్రభుత్వ అవినీతిపై వైసీపీ ఎంపీ రఘు రామకృష్ణరాజు దాఖలు చేసిన పిల్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. సీఎం జగన్, ఆయన బంధుగణం, వివిధ కంపెనీలకు రూ.కోట్లలో అనుచిత లబ్ధి చేకూరేలా వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, రూపొందించిన పాలసీలపై సీబీఐ దర్యాప్తు కోరుతూ రఘురామ పిల్ వేశారు. దీనిపై ‘నాట్ బిఫోర్ మీ’ అంటూ విచారణ నుంచి జస్టిస్ రఘునందనరావు తప్పుకొన్నారు. ఈ నేపథ్యంలో వేరే బెంచ్ వద్ద పిల్ విచారణకు వచ్చేలా చర్యలు తీసుకోవాలని రిజిస్ట్రీని సీజే బెంచ్ ఆదేశించింది.