ఎన్టీఆర్‌ దేవర.. బర్త్‌డే స్పెషల్‌ సాంగ్

మాన్‌ ఆఫ్‌ మాసెస్ ఎన్టీఆర్ క‌థానాయ‌కుడిగా కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న భారీ బ‌డ్జెట్ పాన్ ఇండియా మూవీ ‘దేవర’. ప్రపంచస్థాయిలో బజ్‌ క్రియేట్‌ చేస్తున్న సినిమా ఇది. బాలీవుడ్‌ బ్యూటీ జాన్వీ కపూర్ ఇందులో హీరోయిన్‌గా నటిస్తుండ‌గా బాలీవుడ్‌ స్టార్‌ సైఫ్‌ అలీ ఖాన్ కీల‌క పాత్ర‌లో మెప్పించ‌నున్నారు. రెండు పార్టులుగా తెరకెక్కుతోంది దేవర. ఫస్ట్ పార్టు షూటింగ్‌ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. అక్టోబర్‌ 10న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. తెలుగు, హిందీ, తమిళ్‌, కన్నడ, మలయాళంలో చిత్రాన్ని అత్యంత భారీగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. మే 20న ఎన్టీఆర్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ‘దేవర’ చిత్రం నుంచి తొలి పాట‌ను మేక‌ర్స్ విడుద‌ల చేశారు. ‘ఫియ‌ర్ సాంగ్‌’ అంటూ రిలీజైన ఈ పాట‌ను స‌ర‌స్వ‌తీపుత్ర రామ‌జోగ‌య్య‌శాస్త్రి రాశారు. పాట‌లో లైన్స్ ఎన్టీఆర్ పోషించిన ప‌వ‌ర్‌ఫుల్ పాత్ర‌లోని గ‌ర్జ‌న‌ను తెలియ‌జేస్తున్నాయి. యంగ్ మ్యూజిక్ సెన్సేష‌న్ అనిరుద్ ర‌విచంద‌ర్ సంగీత సార‌థ్యం వ‌హించ‌ట‌మే కాకుండా పాట‌ను అద్భుతంగా పాడారు. దేవ‌ర‌-లార్డ్ ఆఫ్ ఫియ‌ర్‌గా పాట నెక్ట్స్ లెవ‌ల్ ఎలివేష‌న్ ఇస్తోంది. అలాగే పాట‌లోని ఎన్టీఆర్ గ్లింప్స్ అభిమానుల‌కు, సినీ ప్రేక్ష‌కుల‌కు మంచి కిక్‌ను ఇస్తున్నాయి.
ఎన్టీఆర్‌..నీల్‌
ప్ర‌పంచ వ్యాప్తంగా మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్‌కు ఉండే క్రేజ్, ఫ్యాన్ బేస్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. అంచ‌నాల‌కు అనుగుణంగానే తార‌క్ భారీ, క్రేజీ సినిమాల‌ను లైన‌ప్ చేస్తున్నారు. అందులో భాగంగా కె.జి.య‌ఫ్‌, స‌లార్ వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాల‌ను తెర‌కెక్కించిన‌ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్‌తో ఎన్టీఆర్ సినిమా చేస్తున్నారు. ‘ఎన్టీఆర్ నీల్’ అనే వ‌ర్కింగ్ టైటిల్‌తో ఈ మూవీ ప్రారంభం కానుంది. దీనికి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న ఎప్పుడో వ‌చ్చేసింది. దీనిపై ఫ్యాన్స్ స‌హా అంద‌రిలోనూ భారీ అంచ‌నాలున్నాయి. ఎన్టీఆర్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా మేక‌ర్స్ ఎన్టీఆర్ నీల్ మూవీ షూటింగ్‌ను ఆగ‌స్ట్ 2024 నుంచి ప్రారంభించనున్న‌ట్లు ప్ర‌క‌టించారు. తార‌క్ బ‌ర్త్ డే రోజున ఫ్యాన్స్‌కి స‌ర్‌ప్రైజ్‌నిస్తూ మేక‌ర్స్ ఇచ్చిన ఈ అప్‌డేట్ అంద‌రికీ థ్రిల్లింగ్‌గా అనిపించింది.