Mahanaadu-Logo-PNG-Large

SSC పబ్లిక్ పరీక్షల ఫలితాల్లో ర్యాంకులు ప్రకటిస్తే శిక్షార్హులు

– గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ డైరెక్టర్ డి. దేవానంద రెడ్డి వెల్లడి

SSC పబ్లిక్ పరీక్ష ఫలితాల్లో ర్యాంకులు ప్రకటించడం నిషేధమని, అలా ప్రకటిస్తే చట్టరీత్యా శిక్షార్హులని గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ డైరెక్టర్ డి. దేవానంద రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం జీవో ఎం.ఎస్. నెంబర్ 55, పాఠశాల విద్యాశాఖ విభాగం, ది. 27-08-2021ను అనుసరించి పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు మార్చి 2020 నుండి గ్రేడ్ ల స్థానంలో విద్యార్థులకు మార్కులు ప్రధానం చేసే పద్దతిని ప్రవేశపెట్టామన్నారు.

దీనికి అనుగుణంగా, రాష్ట్ర ప్రభుత్వం G.O. Rt.No.83, స్కూల్ ఎడ్యుకేషన్ (Prog.ll) విభాగం 0106-2022 ద్వారా అన్ని పాఠశాలల యాజమాన్యాలు ర్యాంకులు ప్రకటించడాన్ని 1997 చట్టం (1997 చట్టం 25) యొక్క 7A సెక్షన్ ప్రకారం నిషేధించదించామన్నారు. ప్రభుత్వ పరీక్షల సంచాలకుల విభాగం విద్యార్థలకు ఎటువంటి ర్యాంక్‌లను కేటాయించడం లేదని ఆయన తెలిపారు.

విద్యార్థులు మరియు తల్లిదండ్రుల ప్రయోజనాలను కాపాడేందుకు అన్ని పాఠశాల యాజమాన్యాలు SSC పబ్లిక్ పరీక్షల కోసం ఏ స్థాయిలోనైనా ర్యాంకులు ప్రకటించడం/ప్రచురించడం నిషేధించబడిందన్నారు. 1997 చట్టం 25 సెక్షన్ 8 ప్రకారం “ఎవరు ఉల్లంఘించినా, ఉల్లంఘించే ప్రయత్నం చేసినా, కుట్ర చేసినా లేదా ప్రోత్సహిస్తే మూడు సంవత్సరాలకు పైబడి ఏడు సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించబడుతుందని, జైలు శిక్షతో పాటు జరిమానా ఐదు వేల నుండి లక్ష రూపాయల వరకు విధించబడుతుందని గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ డైరెక్టర్ డి. దేవానంద్ రెడ్డి తెలిపారు.