పాలిక్ శ్రీను దర్శకత్వంలో ప్రొడక్షన్ నెం.3 ప్రారంభం

ఐ.ఐ.టి.కృష్ణమూర్తి ఫేం యువ హీరో పృథ్వీ హీరోగా రూపాలి, అంబిక హీరోయిన్లుగా…రచిత్ శివ, ఆర్.ఆర్.క్రియేషన్స్ అండ్ పాలిక్ స్టుడియోస్ పతాకాలపై తెరకెక్కుతున్న ప్రొడక్షన్ నెం.3 చిత్రం బుధవారం లాంచనంగా పూజాకార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ చిత్రాన్ని దుర్గం రాజేష్, రావుల రమేష్, టి.ఎస్.రాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి స్టోరీ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం పాలిక్ శ్రీను. సంగీతం జాన్ భూషన్ అందించగా సురేష్ గంగుల పాటల రచయిత. వెంకట్, నిశాంత్ నిమాటోగ్రఫీ అందిస్తున్నారు. నిషాంత్ ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు. ముందుకు వచ్చిన నిర్మాతలకి ధన్యవాదాలు. త్వరలోనే సినిమా షూటింగ్ కంప్లీట్ చేసి ప్రేక్షకుల ముందుకు వస్తాం అన్నారు. దర్శకుడు పాలిక్ మాట్లాడుతూ… ఇది నాకు ఇది మూడో చిత్రం. నాకు కొరియోగ్రాఫర్ గా మంచి పేరుంది. ఇటీవల రిలీజ్ అయిన రౌద్రరూపాయ నమ: చిత్రానికి మంచి పేరు వచ్చింది. మంచి రేటింగ్స్ ఇచ్చి నన్ను ఎంకరేజ్ చేశారు. నాకు ఎప్పటి నుంచో స్వాతిముత్యం లాంటి ఓ మంచి కుటుంబకథా చిత్రం తీయాలని ఉంది. నా మిత్రుడు ఎస్.ఆర్.పి. ఇచ్చిన కథ నచ్చి ఈ సినిమా తెరకెక్కిస్తున్నాం. భారతదేశంలోని అన్ని ప్రాంతాల నుంచి వివిధ పాత్రలకోసం నటీనటులను తీసుకున్నాం. తెలుగులోని ప్రధాన తారాగణం అంతా కూడా ఇందులో నటిస్తున్నారు. పాటలు కూడా చాలా బాగా వచ్చాయి. ఇందులో ఆమని, ఝాన్సీ లు చాలా వెయిటేజ్ ఉన్న పాత్రలు చేస్తున్నారు. వచ్చే నెల 25 నుంచి చ సెట్స్ మీదకు వెళుతుంది. మంచిర్యాలలో ఓ పాటను తీస్తున్నాం. ఐదు షెడ్యూల్స్ లో సినిమాని పూర్తి చేసి… దిపావళికి సినిమాని విడుదల చేస్తున్నాం అన్నారు.