ఇంట్లోనే ఆ దుకాణం పెట్టిన కేటుగాడు
గుంటూరు జిల్లా కి చెందినవాడు వాడో సైంటిస్ట్. నెట్ ప్లెక్స్ వెబ్ సిరీస్ రేంజ్‌లో ఇంట్లోనే డ్రగ్స్ తయారు చేయడం ప్రారంభించాడు. కట్ చేస్తే..! బాగా చదువుకున్న వ్యక్తిగా…మంచి ఉద్యోగం చేస్తూనే తన బుద్ధిని వక్రమార్గంలో మళ్లించాడు. ఏదో చేసేద్దామని ..మరేదో కనిపెడదామని ప్రయత్నించి చివరకు జైల్లో ఊచలు లెక్కపెడుతున్నాడు
వాడో సైంటిస్ట్. నెట్ ప్లెక్స్ వెబ్ సిరీస్(Netflex web series)రేంజ్‌లో ఇంట్లోనే డ్రగ్స్(Drugs)తయారు చేయడం ప్రారంభించాడు. కట్ చేస్తే..! బాగా చదువుకున్న వ్యక్తిగా…మంచి ఉద్యోగం చేస్తూనే తన బుద్ధిని వక్రమార్గంలో మళ్లించాడు. ఏదో చేసేద్దామని ..మరేదో కనిపెడదామని ప్రయత్నించి చివరకు జైల్లో ఊచలు లెక్కపెడుతున్నాడు. అసలు ఆ సైంటిస్ట్ ఎందుకు జైలుపాలయ్యాడో తెలిస్తే అందరూ ఆశ్చర్యపోతారు. సైంటిస్టులు అంటే సమాజానికి ఉపయోగపడేవి…ప్రజలకు మేలు చేసే వాటిని కనుగొనడం, వాటిని తయారు చేస్తుంటారు. కాని ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) గుంటూరు(Guntur)జిల్లాకు చెందిన ఓ వ్యక్తి ఈజీ మనీకి అలవాడు పడి పక్కదారి తొక్కాడు. ఉన్నత విద్యను అభ్యసించడంతో ప్రముఖ ఫార్మాస్యూటికల్ కంపెనీ(Pharmaceutical company)లలో జూనియర్ సైంటిస్ట్(Junior scientist)గా పని చేస్తున్నాడు. ఆ అనుభవంతోనే డ్రగ్స్ తయారికి ఉపయోగించాడు ఈ ప్రబుద్దుడు. హైదరాబాద్‌లో చాపకింద నీరులా డ్రగ్స్ సరఫరా అవుతోంది. డ్రగ్స్ మాఫియాపై గట్టి నిఘా పెట్టిన ప్రత్యేక బృందాలు చేస్తున్న తనిఖీలు, దాడుల్లోనే ఈ డ్రగ్స్ తయారి సైంటిస్ట్ దొరికిపోయాడు.