-కల్లు తాగి.. గంతులేస్తున్నట్లు ఉంది అతని వ్యవహారం నీకు దమ్ము, సిగ్గు, లజ్జా, మానం ఉంటే నేను పార్టీ ఆఫీసులోనే ఉంటా ఓపెన్ డిబెట్‌కి వస్తావా? అసలు ఏజి దగ్గర ఖాళీ పెట్టె .. ఆ తాళం మాత్రం ఏఏజి దగ్గర ఉందిపొన్నవోలుపై చీఫ్ సెక్రటరీకి ఫిర్యాదు చేస్తాం
– టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య
ఒక పనికిమాలిన, చెత్త న్యాయవాది పొన్నవోలు సుధాకర్. న్యాయవాద వృత్తికే కళంకం తీసుకువస్తున్న వ్యక్తి సుధాకర్. అసలే కోతి.. కల్లు తాగి.. గంతులేస్తున్నట్లు ఉంది అతని వ్యవహారం అని అన్నారు టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు, సీనియర్ నేత వర్ల రామయ్య. బుధవారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన పాత్రికేయ సమావేశంలో వర్ల రామయ్య మాట్లాడుతూ..
పోన్నవోలు తన పరిధి దాటి మాట్లాడుతున్నాడు. ఏ అడ్వకేట్ జనరల్ కూడా బహిరంగంగా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడటం నేను చూడలేదు. ఎందుకురా చంపావు అని మొద్దు శ్రీనుని అడిగితే.. మా బావ కళ్ళలో ఆనందం చూడటానికి అన్నట్లు.. ఎందుకయ్యా చిందులేస్తున్నావు ఏఏజి అంటే.. జగన్ మోహన్ రెడ్డి కళ్ళలో ఆనందం చూడాలని అన్నట్లు ఉంది పొన్నవోలు వ్యవహార శైలి.
నిజంగా జగన్ మోహన్ రెడ్డి కళ్ళల్లో ఆనందం చూడటమే నా లక్ష్యం..దాని కోసం న్యాయవాద వృత్తినైనా భంగపరుస్తా అని నువ్వు అనుకుంటే, వెంటనే నీ పదవికి రాజినామా చేసి వైకాపా చొక్కా వేసుకొని రా..రాజకీయంగా ఫైట్ చెయ్ దమ్ముంటే. ఏఏజి పదవి అనేది ఎక్కడా లేదు. అసలు ఆ పదివి రావటమే ఎక్కువ నీకు. అసలే ఏజి దగ్గర ఖాళీ పెట్టె ఉంటే , దాని తాళం మాత్రం ఏఏజి దగ్గర ఉంది. అడ్వకేట్ జనరల్‌కి మన రాజ్యాంగంలో ఉన్నత స్థానాన్ని కల్పించారు. 175 ఎమ్మెల్యేలు ఉంటే 176 ఎమ్మెల్యేగా ఉంటాడు. ప్రభుత్వానికి న్యాయపరమైన వ్యవహారాలను శాసనసభలో కూర్చొని తెలియజేసి అత్యున్నత అవకాశాన్ని రాజ్యాంగం కల్పిస్తే.. ఈయన బహిరంగంగా ప్రెస్ మీట్‌లు పెట్టి కరడుకట్టిన వైకాపా కార్యకర్తలా మాట్లాడుతున్నాడు.
ఏఏజి ప్రెస్ మీట్ పెట్టటానికి- నిందుతుడికి శిక్ష పెట్టాటానికి ఏం సంబంధం ఉంది? సంజయ్ కు గైడ్ లైన్స్ ఇవ్వాల్సింది పోయి ప్రెస్ మీట్ లు పెడుతున్నావు. ఏజి శ్రీరామ్ కు పదవిని అలంకరణగా ఇచ్చి తన కాళ్ళ దగ్గర కూర్చునే, తన జేబులో వ్యక్తి అయిన పొన్నవోలు సుధాకర్ రెడ్డికి ఏఏజి పదవిని ఇచ్చాడు జగన్ రెడ్డి. ప్రజలు జీతాన్ని ఇస్తుంటే జగన్‌కు, వైకాపా పార్టీకి సేవ చేయటం, హైదరాబాద్, ఢిల్లీ పోయి ప్రెస్ మీట్‌లు పెట్టిటానికి ఏ అధికారం ఉంది పొన్నవోలు సుధాకర్ రెడ్డికి? నీకు సిగ్గు ఉండాలి.
న్యాయమూర్తి తీర్పును తప్పుపట్టవద్దని మేము అనటం లేదు. కానీ కోర్టులో యువర్ హానర్ ని మర్యాదగా మాట్లాడి, బయట ఏక వచనంలో మాట్లాడటం సిగ్గు చేటు. పొన్నవోలు టార్గెట్ కేసు కాదు, అతని టార్గెట్ చంద్రబాబు కాదు. హైకోర్టు చివాట్లు పెడితే సిగ్గుతో తలవంచుకోవలసినది పోయి, ఎగిరెగిరి నాట్యం చేస్తున్నావు. సబ్ కాంట్రాక్టర్ లు తప్పు చేస్తే అది చంద్రబాబుకి ముడిపెడతావు అని అడిగింది కోర్టు నిన్ను. ఒక ముద్దాయిని ఇంతలా హింస పెడతారా? 24గం గడవక ముందే హైకోర్ట్ తీర్పుపై సుప్రీం కోర్టులో పిటిషన్ వేసారు అంటే, నీ లక్ష్యం సత్యం కాదని చంద్రబాబే అని అర్థమవుతుంది.
జగన్ రెడ్డి కూడా ఉదాసీనంగా ప్రజల డబ్బును వీరికి ఇస్తున్నారంటే, దాని అర్థం రేపు అయన కేసులను వాదించుకోవటానికే. ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ ఢిల్లీ వెళ్ళాలి.. అలాంటిది నువ్వు ఎందుకు వెళ్ళావు? సీక్రెట్ అకౌంట్‌లోకి డబ్బులు వచ్చాయని అంటున్నావు.. నీకు దమ్ము, సిగ్గు, లజ్జా, మానం ఉంటే నేను పార్టీ ఆఫీసులోనే ఉంటా ఓపెన్ డిబెట్‌కి వస్తావా? లేక పిచ్చి మాటలు పిచ్చి కుక్కలా మాట్లాడటమేనా?
నిజంగా వాటి మీద నీ దగ్గర ఆధారాలు ఉంటే, కోర్టుకి ఎందుకు చూపించలేదు? 73 ఏళ్లు ఉన్నవారికి కేసులు లేవని నాట్యం చేస్తున్నావు. నువ్వు న్యాయవాదివా? ఎంతోమంది మహానుభావులు అడ్వకేట్ జనరల్‌గా చేసారు. కాని ఇంత దిగజారుడుతనంగా వ్యవహరించలేదు. నీ ప్రతీ నాట్యానికి ఖరీదు కడుతున్నాం.. నువ్వు తప్పుడు కేసుల్లో కొట్టేసిందంతా కక్కిస్తాం గుర్తుపెట్టుకో.
జాతి సంపద చంద్రబాబు పై అక్రమ కేసులు పెడతారా?
చంద్రబాబు దేశ సంపద అని ఆనాటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ అన్నారు. అలాంటి వ్యక్తిపై అక్రమ, దొంగ కేసులు పెడతారా? నువ్వు ఎగిరి ఉమ్ము వేస్తే సూర్యుడిలాంటి చంద్రబాబు కి ఏమవదు. నీ మొహం మీదే పడుతుంది. అసలు నీ లాంటోడిని మరలా ఏఏజిగా కొనసాగించి నిన్నే జగన్ రెడ్డి అక్రమ కేసుల్లో నాట్యమాడిస్తే, ఎలా ఉంటదో అని నా ఆలోచన ఉంది.
రేపు జగన్ రెడ్డి అధికారం నుంచి దిగిపోయి కోర్టు మెట్లెక్కుతాడు. అవినీతి అంటే పొసగని వ్యక్తి చంద్రబాబు అయితే అవినీతి అంటే ప్రాణం జగన్ రెడ్డి. ఏఏజి పొన్నవోలు సుధాకర్ రెడ్డిపై చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి కి ఫిర్యాదు చేయబోతున్నామని తెలియజేశారు. న్యాయవాదులపై ఎటువంటి వ్యాఖ్యలు చేసినా ఉరుకోబోమన్న సంజయ్ దగ్గరకు కూడా, ఇదే ఫిర్యాదు చూపి సుధాకర్ రెడ్డిని ఎప్పుడు అరెస్ట్ చేస్తారో అడుగుతామని అన్నారు.