ఈ మధ్య యంగ్ డైరెక్టర్స్ అందరూ కూడా బాలయ్య వెంటపడుతున్నారు… అవునా అంటే అది నిజమని చెప్పాలి. రీసెంట్ మూవీస్ లిస్ట్ చూస్తే వాటి వెనకున్న డైరెక్టర్స్ అందరూ కూడా యంగ్ డైరెక్టర్లే అని చెప్పాలి. అఖండ తర్వాత యంగ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో వీర సింహారెడ్డి చేశారు. ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయింది. ఆ తర్వాత వెంటనే మరో యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తో ‘భగవంత్ కేసరి’ అంటూ గతే ఏడాది దసరాకి ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బాస్టర్ కొట్టారు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద 100 కోట్లకు పైగా కలెక్షన్స్ అందుకుంది. భగవంత్ కేసరి తర్వాత ప్రజెంట్ బాబీతో తన 109 ప్రాజెక్ట్ చేస్తున్నాడు. వీళ్లతో పాటు రీసెంట్ గా హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కూడా బాలయ్యతో ఓ సినిమా తీయాలని అనుకుంటున్నట్లు చెప్పాడు. అంతేకాదు ఆయన కోసం నా దగ్గర కథ కూడా రెడీగా ఉందని అన్నారు. ఇదిలా ఉంటే.. బాలయ్య లిస్టులో మరో యంగ్ డైరెక్టర్ చేరిపోయాడు. అతను మరెవరో కాదు పవన్ కళ్యాణ్ కి గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ అందించిన హరీష్ శంకర్. లేటెస్ట్ ఫిలింనగర్ రిపోర్ట్స్ ప్రకారం.. బాలకృష్ణ – హరిష్ శంకర్ కాంబినేషన్‌లో ఓ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ తెరకెక్కబోతుందట. ఈ ప్రాజెక్ట్ ని కెవిఎన్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించబోతున్నట్లు తెలిసింది. ఇప్పటికే కథా చర్చలు పూర్తయ్యాయని, హరీష్ శంకర్ తో సినిమాకి బాలయ్య కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్ వినిపిస్తోంది. త్వరలోనే ఇందుకు సంబంధించి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ కూడా వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. హరీష్ శంకర్ ఫస్ట్ టైమ్ బాలయ్యను డైరెక్ట్ చేస్తుండడంతో ఈ ప్రాజెక్టు పై ఇండస్ట్రీ వర్గాల్లో అప్పుడే అంచనాలు మొదలైపోయాయి.