Mahanaadu-Logo-PNG-Large

ప్రభాస్‌ ఆర్‌.ఆర్‌.ఆర్‌లో చేస్తానన్నాడా?

పాన్‌ ఇండియా స్టార్‌ హీరో ప్రభాస్‌ దర్శకుడు రాజమౌళి ఎంత సన్నిహితులో అందరికీ తెలిసిందే. అది ఎంత సన్నిహితమంటే ‘ఆర్ ఆర్ ఆర్’ సినిమాలో త‌న‌ని క‌నీసం గెస్ట్ పాత్ర అయినా ఇవ్వాలని మీకు అనిపించ‌లేదా? అని ఓపెన్ గా అడిగే అంత‌. తానెంత పెద్ద స్టార్ అయినా అన్నింటిని ప‌క్క‌న‌బెట్టి డార్లింగ్ అలా అడ‌గ‌డంతోనే వాళ్లిద్ద‌రు ఎంత క్లోజ్ అన్నది అద్దం ప‌డుతుంది. అదే క్లోజ్ నెస్ తో రాజ‌మౌళి డార్లింగ్ గురించి ఓ సంద‌ర్భంలా స‌ర‌దాగా ఓ మాట అన్నారు. ‘ఆర్ ఆర్ ఆర్’ ప్రీమియ‌ర్ కి ప్ర‌భాస్ వ‌స్తున్నాడా? అని ఎన్టీఆర్ అంటే ప్ర‌భాస్ ప్రీమియ‌ర్ కి క‌దిలి రావడ‌మా..అది జ‌ర‌గ‌దు అంటూ జ‌క్క‌న్న న‌వ్వుతూ క‌రాఖండీగా చెప్పేసాడు. అప్పుడే ప్ర‌భాస్ అంత బ‌ద్ద క‌స్తుడా? అన్న ఓ డౌట్ రెయిజ్ అయింది అంద‌రిలో. ఆన్ సెట్స్ లో ప్ర‌భాస్ ఎలా ఉంటాడు? అన్న‌ది తెలియ‌దు గానీ రాజ‌మౌళి అన్న ఆ మాట మాత్రం నెట్టింట వైర‌ల్ గా మారింది. ప్ర‌భాస్ లేజీ త‌నాన్ని ఆ మాట హైలైట్ చేసిన‌ట్లు అయింది. ఇకపోతే ఆయన సినిమాలు కూడా నిధానంగా రావడంతో అలాంటి సందేహం వ‌స్తుంది. ఎందుకంటే టాలీవుడ్ లో ఏ హీరో లేనంత బిజీగా ప్ర‌భాస్ ఉన్నాడు. అత‌డి సినిమాల లైన‌ప్..క‌మిట్ అవుతోన్న విధానం చూస్తే ఇదే అనిపిస్తుంది. అందులోనూ వ‌రుస‌గా పాన్ ఇండియా సినిమాలే చేస్తున్నాడు. వాటికోసం ఆయ‌న ప్ర‌త్యేకంగా ఎలా స‌న్న‌ధం అవుతున్నాడో? క‌నిపిస్తూనే ఉంటుంది. విదేశాల్లో అవ‌స‌రం మేర పాత్ర‌కి అనుగుణంగా ట్రైనింగ్ లు ఇలా ప్ర‌తీ చోట ప్ర‌భాస్ ఎఫెర్ట్ వంద శాతం క‌నిపిస్తుంది. ప్రస్తుతం’క‌ల్కి 2898′ మేలో రిలీజ్ అవుతుంది. ‘రాజాసాబ్’ ఇప్ప‌టికే కొంత భాగం షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇది వ‌చ్చే ఏడాది రిలీజ్ అవుతుంది.’ క‌ల్కీ’..’రాజాసాబ్’..’స‌లార్’ మూడు సినిమా షూటింగ్ ల‌కు ఒకేసారి హాజ‌రైన సంద‌ర్భాలున్నాయి. అలాగే మంచు విష్ణు న‌టిస్తోన్న ‘క‌న్న‌ప్ప’ లో లార్డ్ శివ రోల్ పోషిస్తున్నాడు. త్వ‌ర‌లో ‘స‌లార్ -2’ షూటింగ్ మొద‌లు వుతుంది. అలాగే సెప్టెంబ‌ర్ నుంచి ‘స్పిరిట్’ కూడా ప‌ట్టాలె క్కించ‌బోతున్నారు. మరి ఇంత బిజీగా ఉండే హీరోని పట్టుకుని లేజీ అంటే ఎలా గురూ అంటున్నారు ప్రభాస్‌ ఫ్యాన్స్‌ కొందరు.