Mahanaadu-Logo-PNG-Large

అన్నాళ్లు ఓ లెక్క.. ఆయనొచ్చాక ఓ లెక్క!

నీ లెక్క..నా లెక్క..
కలిపితే దేశం లెక్క..
అది పక్కా…
ఆ లెక్కను ఖచ్చితంగా
కట్టి భారతదేశ
ఆర్థిక వ్యవస్థను
గాడిలో పెట్టిన
లెక్కల మాస్టారు..
మహలనోబిస్..
మానవ రూపంలోని
గణిత సిలబస్..!

అందరూ అ ఆ ఇ ఈలు
ఎ బి సి డిలు దిద్దే వయసులో జీవితపు
లెక్కలు తేల్చేశాడు
ప్రశాంత్ చంద్ర మహలనోబిస్
అక్కడితో చెప్పలేదు బస్..
ఈ లెక్కల బాస్…!

గుణింతాలే బాల్యమై..
కూడికలు,తీసివేతలే
పెరిగే వయసై..
లెక్కలే మనసై…
ఎంతటి లెక్కనైనా చిటికెలో
చెయ్యడానికి చిన్నప్పుడే సై!

సామాన్యుడికి అర్థం కాని
గణిత కొలత కనిపెడితే
దాని పేరే అయింది
మహలనోబిస్ డిస్టెన్స్..
అపారమైన అతగాడి
లెక్కల సెన్స్..
గణిత సైన్స్…
నెహ్రూని చేరడానికి
అయింది లైసెన్స్..!

మన దేశ ఆర్థిక ప్రహేళిక
పంచవర్ష ప్రణాళిక…
పండిట్ జీ రూపశిల్పిగా
మహలనోబిస్ రూపకర్తగా..
ఆవిర్భవించి దేశ ఆర్థిక
పురోగతికి వేసింది పునాది..
మహలనోబిస్ మస్తిష్కమే
జాతీయ ఆదాయ
లెక్కలకు ప్రాతిపదిక..
ఆ బుర్రలోనే పుట్టింది
భారీ పరిశ్రమల ఏర్పాటుకు
పెద్ద పీట వేస్తూ
రెండో పంచవర్ష ప్రణాళిక!
స్టాటస్టిక్స్ నిపుణుడు మహలనోబిస్