• ఎస్సీ కులానికి చెందిన వ్యక్తిపై అధికారం అడ్డంపెట్టుకుని మధుసూదన్ యాదవ్ నాడు దౌర్జన్యం
• అధికారుల సాయంతో దేవాలయాల భూములు వైసీపీ నేతలు కబ్జా
• భూ కబ్జాలపై పెద్ద ఎత్తున అర్జీల వెల్లువ.. సమస్యల పరిష్కారానికి కృషి చేసిన నేతలు
మంగళగిరి, మహానాడు: గతంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే వైవీ సుబ్బారెడ్డి సహకారంతో డిఎస్పీగా ప్రమోషన్ పొంది.. పేదల ఇళ్ల స్థలాలు కొట్టేయడం, అధిక వడ్డీలకు డబ్బులు ఇచ్చి దండుకోవడం, కాల్ మనీ వ్యాపారిలా ప్రజలను ఇబ్బందులకు గురిచేయడం.. నేటికి వైసీపీ నేతలకు తొత్తుగా వ్యవహరిస్తూ చంద్రబాబు నాయుడు పర్యటనలు, ఇతర మంత్రులు, అధికారుల సమాచారాన్ని వైసీపీ నేతలకు అందజేస్తున్నారని.. ఇతనిపై శాఖాపరమైన విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని గుంటూరు జిల్లా తాడేపల్లికి చెందిన జె. సుధీర్ అనే వ్యక్తి సోమవారం గ్రీవెన్స్ లో ఫిర్యాదు చేశారు. అర్జీ స్వీకరించిన నేతలు మంత్రి డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి, పొలిట్ బ్యూరో సభ్యుడు రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి, బుచ్చిరాంప్రసాద్ లు విచారించి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. పెద్ద ఎత్తున వచ్చిన అర్జీదారుల నుండి వినతులు స్వీకరించి పరిష్కారానికి కృషి చేశారు.
• నేను ఎస్సీ మాదిగ కులంకు చెందిన వాడనని.. గతంలో వైసీపీ నేతలు బుర్రా మధుసూదన్ యాదవ్ అయన అనుచరులు నా పొలం వద్దకు వచ్చి బలవంతంగా కంచెను తొలగించి దౌర్జన్యానికి దిగారు. భూమిపై కోర్టులో స్టే ఆర్డర్ ఉన్నా.. లెక్క చేయకుండా జేసీబీతో కంచెను ధ్వంసం చేశారు. దాంతో రూ. 35 లక్షల వరకు నష్టం వాటిల్లింది.. నాడు పోలీసులు లంచం తీసుకుని వైసీపీ నేతలకు వత్తాసు పలికారు. వారిపై కఠిన చర్యలు తీసుకొని నాకు న్యాయం చేయాలి అని ప్రకాశం జిల్లా చంద్రశేఖరపురం మండలం నల్లమడుగు గ్రామానికి చెందిన సూరి పోగు సామ్యూల్ నేతలకు అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేశారు.
• జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఏపీ ఫైబర్ ను సర్వ నాశనం చేశారని.. ఛానల్స్ ను తీసివేయడమే కాకుండా నెలవారి బిల్లులను పెంచి వినియోగదారులను దోచుకున్నారని, అలాగే ఆపరేటర్లను ఇబ్బంది పెట్టారని, కేబుల్ నెట్ వర్క్ ఆపరేటర్లను కూటమి ప్రభుత్వం ఆదుకోవాలని తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట మండలం వాడపాలెంకు చెందిన బండారు నరసింహమూర్తి విజ్ఞప్తి చేశారు.
• తెనాలి మండలంలోని సంగమేశ్వర స్వామి దేవస్థాన భూములను వైసీపీ నేతలు కబ్జా చేసి వారిపేరు మీదకు మార్చుకున్నారని.. రెవెన్యూ, ఎండోమెంట్ అధికారులు వైసీపీ నేతలకు పూర్తిగా సహకరించి దేవస్థానంకు రావాల్సిన ఆదాయాన్ని గండికొట్టారని అలాగే దేవస్థానం భూములను పేదలందరికీ ఇళ్ల పేరుతో తీసుకుని అక్షరాల రూ. 80 లక్షలను ప్రైవేట్ వ్యక్తికి కట్టబెట్టారని దీనిపై విచారణ జరిపి అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని తెనాలికి చెందిన వై. కామేశ్వరరావు గ్రీవెన్స్ లో నేతలను కలిసి ఫిర్యాదు చేశారు.
• తమ భూమి ఆక్రమణపై బీజీవీ కండిక్ర గ్రామస్తులు బలరామిరెడ్డి, నరసింహరెడ్డి, డి.వెంకటరెడ్డి లపై బిట్రగుంట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినా నేటికి పట్టించుకోలేదని.. రెవెన్యూ అధికారులు, పోలీసులు కబ్జాదారులు ఆక్రమించుకున్న తమ భూమిని విడిపించి న్యాయం చేయాలని నెల్లూరు జిల్లాకు చెందిన కామేపల్లి కోటయ్య విజ్ఞప్తి చేశారు.
• తన భూములను కబ్జా చేయడమే కాకుండా తనను తన కుటుంబాన్ని చంపేస్తామని రామకృష్ణ, గుర్రం సుబ్బరాయుడు లు బెదిరిస్తున్నారని వారి నుండి తమకు ప్రాణహాణి ఉందని తమకు ప్రాణ రక్షణ కల్పించి కబ్జాకు గురై భూములను విడిపించాలని కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన నవీజ్ అహ్మద్ గ్రీవెన్స్ లో నేతలను కలిసి విజ్ఞప్తి చేశారు.
• తమకు పూర్వికుల నుండి స్థిరాస్తిగా వచ్చిన భూమిని అధికారులు లంచాలు తీసుకుని అక్రమదారులకు పాస్ పుస్తకాలు ఇచ్చారని.. వాటిని రద్దు చేసి వాస్తవాలను గుర్తించి భూమికి హక్కుదారులమైన తమకు హక్కులను కల్పించాలని గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం అమినాబాద్ కు చెందిన నభీసాహెబ్ కోరారు.
• తాము ప్రకాశం జిల్లా సీఎస్ పురం మండలం నుండి నెల్లూరు జిల్లా పొంగూరుకు బతుకుదెరుకుకోసం అని వెళితే తమకు వారసత్వంగా వచ్చిన భూమిని కబ్జా చేశారని.. తమ వద్ద భూమికి సంబంధించిన అన్ని ఆధారాలు ఉన్నాయని కబ్జాదారుల నుండి భూమిని విడిపించి న్యాయం చేయాలని సొంపల్లి బుజ్జినారాయణ విజ్ఞప్తి చేశారు.
• టీడీపీ గెలుపు పాత్రలో భాగస్వామ్యం వహించిన రజకుల అభివృద్ధికి జీవో నెంబర్ 25 ప్రకారం రజక సంఘ కమిటీలు ఏర్పాటు చేసి తమ సంక్షేమానికి తోడ్పడాలని ఏపీ రజక ఎస్సీ సాధన సమితి అధ్యక్షుడు నందవరం శ్రీనివాసులు గ్రీవెన్స్ లో నేతలను కలిసి వినతి ఇచ్చి విజ్ఞప్తి చేశారు.