Mahanaadu-Logo-PNG-Large

పూనకాలు తెప్పిస్తోన్న ‘పుష్ప 2 టీజర్

ప్ర‌పంచ‌వ్యాప్తంగా సినిమా ప్రేక్ష‌కులు ఎదురుచూస్తున్న చిత్రం ‘పుష్ప‌:2 ది రూల్’. ‘పుష్ప ది రైజ్‌’తో ప్ర‌పంచ సినీ ప్రేమికుల‌ను అమితంగా ఆక‌ట్టుకోవ‌డ‌మే ఇందుకు కార‌ణం. ఈ చిత్రంలో ఐకాన్‌స్టార్ న‌ట‌న‌కు, బ్రిలియంట్ డైరెక్ట‌ర్ సుకుమార్ ద‌ర్శ‌క‌త్వ ప్ర‌తిభ‌కు అంద‌రూ ఫిదా అయిపోయిన సంగ‌తి తెలిసిందే. ఈ ఇద్ద‌రి క‌ల‌యిక‌లో రాబోతున్న పుష్ప‌-2 ది రూల్‌పై ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఆకాశ‌మే హ‌ద్దుగా అంచ‌నాలు వున్నాయి. ఏప్రిల్ 8, ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా మేకర్స్ ఈ చిత్ర టీజర్‌ని విడుదల చేశారు. ఈ టీజర్ అందరికీ పూనకాలు తెప్పిస్తోంది. ఈ టీజర్‌లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గంగమ్మ జాతర గెటప్‌లో వీర మాస్ అవతార్‌లో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇంతకు ముందు టాలీవుడ్‌లో ఏ హీరో కనిపించని విధంగా ఊర మాస్ అవతార్‌లో కనిపించి.. సినిమాపై అమాంతం అంచనాలను పెంచేశారు. గంగమ్మ జాతరలో వచ్చే సన్నివేశంతో టీజర్ కట్ చేసిన విధానం.. అందరినీ మెస్మరైజ్ చేస్తోంది. ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా ఈ చిత్రం వరల్డ్ వైడ్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది.