– బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి
విశాఖపట్నం ఈరోజు సంఘం శరత్ థియేటర్ సమీపంలో స్కూల్ పిల్లలతో వెళ్తున్న ఆటో రోడ్డు ప్రమాదానికి గురవడం అత్యంత బాధాకరం. ఈ ప్రమాద దృశ్యాలు చాలా హృదయవిదారకంగా ఉన్నాయి. వీడియో దృశ్యాలు చూస్తే కళ్లు చెమర్చాయి. ఈ ప్రమాదంలో అభంశుభం తెలియని చిన్నారులు గాయాల పాలై వారు క్షోభను అనుభవించడం చూస్తుంటే కళ్ళు చెమర్చుతున్నాయి. ఈ ప్రమాద ఘటనపై తక్షణమే ప్రభుత్వం పూర్తి స్థాయిలో విచారించి, తగ్గిన చర్యలు తీసుకోవాలి.
రాష్ట్ర ప్రభుత్వం పెంటనే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారులకి మెరుగైన వైద్య సహాయం అందించాలి.