– జ్ఞానానంద రామానంద ఆశ్రమంలో తల్లిదండ్రులు లేని బాలికపై అత్యాచారం
– ఆశ్రమం నుంచి తప్పించుకుని విజయవాడలో పోలీసులకు ఫిర్యాదు
– వెంకోజీపాలెంలోని జ్ఞానానంద రామానంద ఆశ్రమంలో 15 ఏళ్ల బాలికపై పూర్ణానంద స్వామి – గొలుసులతో బంధించి అత్యాచారం చేసినట్టు ఆరోపణలు
– బాలికపై రెండేళ్లుగా కీచక స్వామీజీఅత్యాచారం
– కాళ్లకు గొలుసులు కట్టి
ఇప్పటికే భూకబ్జాలు.. కిడ్నాపులు.. హత్యలు.. గంజాయ్ బ్యాచ్.. సీమ రౌడీల విశృంఖలత్వంతో హడలిపోతున్న విశాఖ వాసులకు, స్వామీజీలు అదనపు తలనొప్పిలా పరిణమించారు. సర్కారులో స్వాములకు డిమాండ్ పెరగడంతో ఈ మధ్య చాలామంది స్వాములు, విశాఖలో ఆశ్రమాలు ఏర్పాటుచేసుకుంటున్నారు. తాజాగా ఓ 65 ఏళ్ల స్వామీజీ , ఓ మైనర్ బాలికపై అత్యాచారయత్నం చేసిన వైనం వెలుగుచూసింది. ‘ఈ వయసులో ఆ స్వామికి ఇదేం వంకరబుద్ధి’ అంటూ జనం ఈసడించుకుంటున్నారు. వివరాల్లోకి వెళితే..
విశాఖ: దొంగ స్వామీజీల రాసలీలలు బయటపడటం పెరిగియింది. స్వామీజీల ముసుసులో వారు వెనక నడిపించే బాగోతాలు ఒక్కొక్కటి బయట పడుతున్నాయి. తాజాగా ఓ స్వామీజీ రెండెళ్ల పాటు ఓ బాలికను
అత్యాచారం చేయడం కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళ్తే రాజమహేంద్రవరానికి ఓ బాలిక (15) చిన్నప్పుడే తన తల్లిదండ్రులను కోల్పోయింది. ఆమె బంధువులు తనని 10వ తరగతి వరకు చదివించారు.
ఆ తర్వాత విశాఖపట్నంలోని కొత్త వెంకోజి పాలెం వద్ద ఉన్న జ్ఞాననంద అనే ఆశ్రమానికి పంపించారు. ఆ ఆశ్రమాన్ని పూర్ణానంద అనే స్వామీజీ నిర్వహిస్తున్నాడు. అతడు ఆ అమ్మాయికి ఆవులకు మేత వేయడం, పేడ తీయడం లాంటి పనులు చేయించేవాడు. అయితే కొద్దిరోజులకే ఆ స్వామీజీకి ఆ బాలికపై కన్ను పడింది. ఎలాగైన ఆమెను అనుభవించాలనుకున్నాడు. చివరికి అత్యాచారనికి పాల్పడ్డాడు. అప్పటి నుంచి ప్రతిరోజూ పూర్ణానంద అతడి గదిలోకి ఆమెను అత్యాచారం చేసేవాడు.
అంతేకాదు ఆ స్వామీజీ ఆమెను అతడి గదిలోనే కాళ్లకు గోలుసులు కట్టి బంధించేవాడు. ఆమె ఎదురువస్తే కొట్టేవాడు కూడా. అలాగే ఆహారం పెట్టకుండా ఇబ్బంది పట్టేవాడు. కేవలం రెండు చెంచాలతో అన్నాన్ని మాత్రమే నీటితో కలిపి పెట్టేవాడు. ఆమె కాలకృత్యాలు తీసుకునేందుకు అనుమతించేవాడు కాదు. ఇక చేసేదేమి లేక ఆమె బకెట్‌లోనే తీర్చుకోవాల్సిన పరిస్థితి ఉండేది. అలాగే రెండు వారాలకొకసారి ఆమె స్నానం చేయాల్సిన దుస్థితి.
ఇలా సుమారు రెండు సంవత్సరాల వరకు ఆ బాలికను చిత్రహింసలు పెట్టాడు. అయితే ఇటీవల జూన్ 13న ఓ పనిమనిషి సహాయంతో ఆ బాలిక తప్పించుకుంది. అక్కడి నుంచి పారిపోయి తనకు పరిచయమైన ఓ మహిళకు తనకు జరిగిన అన్యాయం గురించి చెప్పింది. దీంతో ఆ మహిళ ఆ బాలికను కృష్ణా జిల్లాలోని కంకిపాడులో ఉన్న హాస్టల్లో చేర్చాలని యత్నించింది. కానీ హాస్టల్ నిర్వాకులు మాత్రం అందుకు ఒప్పుకోలేదు. ఆమెను చేర్చుకోవాలంటే పోలీస్ స్టేషన్ నుంచి పర్మిషన్ లెటర్ తీసుకురావాలన్నారు.
ఇక చివరికి ఆ మహిళ పోలీస్ స్టేషన్‌కు వెళ్లగా పోలీసులు లెటర్ ఇచ్చారు. ఆ తర్వాత ఆ బాలికను బాలల సంక్షేమ కమిటీకి తీసుకెళ్లింది. ఆమె అనుభవించిన నరకాన్ని అక్కడ ఉన్నవారికి వివరించింది. అనంతరం సీడబ్య్లూసీ సభ్యులు విజయవాడలోని దిశా పోలీస్ స్టేషన్‌కు ఆమెను పంపించారు. ఆ బాలిక చెప్పిన వివరాల ప్రకారం పూర్ణానంద స్వామీజీపై ఫోక్సో కేసు నమోదు చేశారు.
ఆమెను వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి పంపిచారు. ఎట్టకేలకు ఆ స్వామీజీని విశాఖపట్నం పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం ఆ బాలికను వైద్య పరీక్షల కోసం ప్రభుత్వాసుపత్రి తరలించారు. అయితే పూర్ణానంద స్వామిజీ దీనిపై స్పందించారు. కొంత మంది ఆశ్రమ భూములు కొట్టేయాలని చూస్తున్నారని.. ఈ నేపథ్యంలోనే కుట్ర జరిగిందని అంటున్నారు.