రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమాతో వరల్డ్ వైడ్ గా అందరి దృష్టిని ఆకర్షించడమే జపాన్ లాంటి దేశాలలో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్నారు. ఒకప్పుడు రజినీకాంత్ ని జపాన్ ఆడియన్స్ ఎక్కువగా అభిమానించేవారు. ఇప్పుడు జక్కన్న సినిమాలపై ప్రత్యేక ఆసక్తి చూపిస్తున్నారు. రాజమౌళి నుంచి రాబోయే సినిమాలకి సంబందించిన అప్డేట్స్ తెలుసుకోవాలని ఆసక్తి చూపిస్తున్నారు. తాజాగా జపాన్ లో ఆర్ఆర్ఆర్ సినిమా స్పెషల్ షోలు ప్రదర్శించారు. అక్కడ థియేటర్స్ కు జక్కన్న కూడా వెళ్లారు. ఇక ఆయన వస్తున్నారని తెలుసుకున్న జనాలు ఒక్కసారిగా ఎగబడ్డారు. రాజమౌళితో ప్రత్యేకంగా ఫొటోలు దిగడమే కాకుండా ప్రత్యేకంగా వారికి కొన్ని గిఫ్టులు కూడా ఇచ్చారు. ఇక రాజమౌళి తో పాటు ఆయన సతీమణి రమా రాజమౌళి కూడా అక్కడికి వెళ్లారు. ఇక రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేయబోయే ఎస్ఎస్ఎంబి 29 సినిమాకి సంబందించిన కీలక అప్డేట్ కూడా అక్కడే ఇచ్చారు. నెక్స్ట్ చేయబోయే సినిమా స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ అయ్యిందని ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ పనులు స్టార్ట్ అయ్యానని తెలిపాడు. అలాగే ఈ సినిమాకి సంబందించి ఇప్పటి వరకు హీరో మాత్రమే ఫైనల్ అయ్యాడని తెలిపారు. అలాగే ఈ సినిమాలో మహేష్ బాబుని హీరోగా చేస్తున్నాడని, అతను చాలా అందంగా ఉంటాడని, మూవీ కంప్లీట్ అయిన తర్వాత అతన్ని ఇక్కడికి తీసుకొచ్చి మీ అందరికి పరిచయం చేస్తానని రాజమౌళి జపాన్ అభిమానులకి చెప్పడం విశేషం. ఇక సినిమా షూటింగ్ ను వీలైనంత త్వరగా ఫినిష్ చేసి రిలీజ్ చేస్తామని కూడా అన్నారు. ఇక రాజమౌళి ఇచ్చిన అప్డేట్ జపాన్ ఆడియెన్స్ ను కూడా ఎంతగానో ఎట్రాక్ట్ చేసింది.