రాజ్‌తరుణ్‌ లావణ్య కొత్త వ్యవహారం

ప్రస్తుతం టాలీవుడ్‌లో ఎక్కడ చూసినా రాజ్ తరుణ్, లావణ్య ఈ వివాదం ఈ వివాదం హాట్‌ టాపిక్‌గా మారింది. ప్రధాన మీడియా ఛానల్స్ సైతం ఈ వివాదంపై ఎక్కువ ఫోకస్ చేస్తున్నాయి. రాజ్ తరుణ్ తనని మోసం చేశాడంటూ లావణ్య ముందుగా పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కింది. అతని మీద ఫిర్యాదు చేసింది. ఆధారాలు సమర్పించడంతో పోలీసులు కేసు ఫైల్ చేసి రాజ్ తరుణ్ కి నోటీసులు ఇచ్చారు. అయితే రాజ్ తరుణ్ ఈ కేసుపై హైకోర్టుని ఆశ్రయించారు. వీరిద్దరి గొడవ ఇలా సాగుతూ ఉండగానే మధ్యలోకి రాజ్ తరుణ్ కి మద్దతుగా ఆర్జే శేఖర్ భాషా మీడియా ముందుకొచ్చారు. లావణ్య మీద సంచలన ఆరోపణలు చేశారు. రెగ్యులర్ గా మీడియా ఛానల్స్ కి ఇంటర్వ్యూలు ఇస్తూ లావణ్య డ్రగ్ అడిక్ట్ అని, అలాగే చాలా మందికి డ్రగ్స్ అలవాటు చేసిందని, బ్లాక్ మెయిల్ చేస్తోందని ఆరోపణలు చేశారు. మస్తాన్ సాయితో ఆమెకి ఎఫైర్ ఉందంటూ కొన్ని ఆడియో బైట్స్ కూడా బయట పెట్టారు. ఇవి సంచలనంగా మారాయి. ఇక ఇదంతా పాత కథే అందరికీ తెలిసిన విషయమే. ఓ ఛానల్ డిబేట్ లో లావణ్య శేఖర్ భాషాని చెప్పుతో కొట్టింది. దీంతో ఈ వివాదం మరింత రాజుకుంది. ఆ తరువాత లావణ్య తనకి డ్రగ్స్ అలవాటు చేసిందని ఓ అమ్మాయి మీడియా ముందుకొచ్చి చెప్పడంతో పాటు పోలీసులకి ఫిర్యాదు చేసింది. శేఖర్ భాషా మా ఇంటికొచ్చి నా మీద దాడి చేశాడని, ప్రైవేట్ పార్ట్స్ పై కాళ్లతో తన్ని గాయపరిచాడని లావణ్య పోలీసులకి ఫిర్యాదు చేసింది. ఇది జరిగిన రోజు సాయంత్రానికి శేఖర్ భాషా కూడా తనపై లావణ్యకి సంబందించిన వారు, అలాగే డ్రగ్స్ మాఫియా వెనుక ఉన్న వాళ్ళు దాడి చేసి చంపే ప్రయత్నం చేశారని హాస్పిటల్ లో జాయిన్ అయ్యాడు. హాస్పిటల్ బెడ్ మీద నుంచి ఇంటర్వ్యూలు ఇచ్చాడు. పోలీసులకి కూడా ఫిర్యాదు చేశాడు. అలాగే లావణ్యపై తన పోరాటం ఆగదని శేఖర్ భాషా ఛాలెంజ్ చేసాడు. ఇవన్నీ ఇలా నడుస్తూ ఉండగానే రాజ్ తరుణ్ తల్లిదండ్రులు పోలీసులని ఆశ్రయించి లావణ్యతో మాకు ప్రాణహాని ఉందని ఫిర్యాదు చేశారు. దీనిని కూడా పోలీసులు తీసుకున్నారు. లావణ్య ఫోన్ చేసి బెదిరింపులకి పాల్పడుతుందని రాజ్ తరుణ్ తల్లిదండ్రులు ఆరోపించారు. అయితే రాజ్ తరుణ్ మాత్రం లావణ్య వ్యవహారంలో మీడియా ముందుకి రాకుండా కోర్టు ద్వారానే సమస్యని పరిష్కరించుకోవాలని అనుకుంటున్నారు. మరి ఈ వివాదం రానున్న రోజుల్లో ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి. ఇకపోతే ఈ విషయంలో రాజ్‌తరుణ్‌ది ఏ తప్పులేదా మొత్తం అంతా లావణ్య మాత్రమే చేసిందా. లేక ఇద్దరి మధ్య సానిహిత్యం ఉందా అన్న విషయంపై సోషల్‌ మీడియాలో రకరకాల విమర్శలు గుప్పుమంటున్నాయి. ఏది ఏమౌనప్పటికీ ఫ్యాన్స్‌ హీరోలని దేవుళ్ళుగా భావిస్తారు. వారి నుంచి కొన్ని వివాదాలు బయటకు వచ్చినప్పుడు ఎలాంటివారో అర్ధంకాక సతమతమవుతుంటారు. ఇటీవలె కన్నడ హీరో ఓ మర్దర్‌ కేసులో ఇరుక్కున్ని వివాదానికి గురైన విషయం కూడా తెలిసిందే. మరి ఈ హీరోలు కేవలం తెరపైన మాత్రమే హీరోలా.. నిజ జీవితంలో కాదా అనే వాదనలు కూడా మరో పక్క వినిపిస్తున్నాయి.