ఉత్తర ప్రదేశ్‌లోని అయోధ్య లో రామమందిర్ జనవరి 22న ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో ఆరు వేల మందికి ఆహ్వాన పత్రికలు పంపారు.
రామమందిర్ ప్రారంభోత్స వానికి ఇంకా కొన్ని రోజుల సమయమే ఉండడంతో హిందువులు ఆత్రుతగా ఎదురుచూస్తు న్నారు. రామమందిరాన్ని అత్యంత సుందరంగా నిర్మించారు.
జనవరి 22న ప్రధాని నరేంద్ర మోడీ రామమం దిరాన్ని ప్రారంభించను న్నారు. రామమందిర ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయి. దేశ, విదేశాల్లో ఉన్నవారికి 7 వేల ఆహ్వానాలు పంపినట్టు సమాచారం.
ఆహ్వానం అందుకున్న వారిలో టాలీవుడ్ అగ్రనటులు చిరంజీవి, ప్రభాస్ కూడా ఉన్నారు. ప్రారంభోత్సవానికి లక్షలాది మంది రామ భక్తులు తరలిరానున్నారు. భక్తులు ఇంటి నుంచి వీక్షించాలని ప్రధాని మోడీ పిలుపు నిచ్చారు.
ఆహ్వాన పత్రిక అందిన సెలబ్రిటీలు
- రజనీకాంత్
- అమితాబ్ బచ్చన్
- మాధురి దీక్షిత్
- అక్షయ్ కుమార్
- అనుపమ్ ఖేర్
- చిరంజీవి
- సంజయ్‌లీలా బన్సాలీ
- ధనుష్
- మోహన్‌లాల్
- ప్రభాస్
- చిరంజీవి
- రిషబ్‌శెట్టి
- కంగనా రనౌత్
- మధుర్ భండేకర్
- టైగర్ ష్రూష్ జాకీష్రూఫ్
- అజయ్ దేవగన్
- యశ్
రాజకీయ ప్రముఖులు:
- బిజెపి సీనియర్ నేతలు ఎల్‌కె అద్వానీ, మురళీ మనోహర్ జోషి
- కాంగ్రెస్ నేత సోనియా గాంధీ
- బిహార్ సిఎం నితీశ్ కుమార్
- కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే
- మాజీ ప్రధాని, సీనియర్ కాంగ్రెస్ నేత మన్మోహన్ సింగ్
- హిమాచల్ ప్రదేశ్ మంత్రి విక్రమాదిత్య సింగ్
- సిపిఐఎం నేతలు
- కాంగెస్ ఎంపి అధీర్ రంజన్ చౌదరి
క్రీడాకారులు:
- విరాట్ కోహ్లీ
- సచిన్ టెండుల్కర్
వ్యాపారవేత్తలు:
- ముఖేశ్ అంబానీ
- రతన్ టాటా
- గౌతమ్ అదానీ
- అనిల్ అంబానీ