హైదరాబాద్, మహానాడు : ఇటీవల కాలంలో హైదరాబాద్‌లో గడువు ముగిసిన, కలుషిత ఆహారాన్ని అందిస్తూ హోటళ్లు, కేఫ్‌లు, రెస్టారెంట్లు భోజన ప్రియులను దోచుకుంటున్నా యి. వారి ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. వేల రూపాయలు డబ్బు పెట్టి తింటునా నాణ్యత లేని ఆహారం అందిస్తున్నారు. తాజాగా మాదాపూర్ రామేశ్వ రం కేఫ్‌లో జరిగిన తనిఖీల్లో విస్తుపోయే విషయాలు బయటకు వచ్చాయి. గడువు ముగుసిన 100 కిలోల మినపప్పు, 10 కిలోల పెరుగు, 8 లీటర్ల పాలు తనిఖీల్లో బయటపడ్డాయి. దాంతో అధికారులు చర్యలు చేపట్టారు.