ఆర్జీవీ షష్టిపూర్తి వయసులో ఏంటయ్యా ఈ పనులు అంటున్నారు నెటిజన్లు. ఇంతకీ ఏం చేశాడు అంటే ఆయన షేర్ చేసిన ఆ ఫొటో చూస్తే అందరూ ముక్కు మీద వేలు వేసుకోవల్సిందే. 60 ప్లస్ అంటే ఏంటి… దాదాపు అంతా అయిపోయింది అనుకుంటారు. కానీ వీటన్నిటికీ విరుద్ధం ఆర్జీవీ. ఈ వయసులో మందు.. ముక్క..మగువ అంటూ ఎప్పటికప్పుడు అందరికీ షాక్‌ల మీద షాక్‌లు ఇస్తూ ఉంటాడు. పోనీ తను చేసుకునేది ఏదో గుట్టు చప్పుడు కాకుండా చేసుకుంటాడా అంటే.. అదీ కాదు ప్రతిదానికీ పబ్లిసిటీ. ఇక ఇవన్నీ ఏవో పబ్లిసిటీ స్టంట్లులే అనుకోవాలా.. లేక వర్మ లైఫ్ స్టైలే అంత అనుకావాలా. ఇకపోతే ఇంతక ముందు తన కథానాయికలను ముద్దు పెట్టుకోవడం, ఘాడంగా కౌగిలించుకోవడం… వారిని ఇష్టానుసారం తాకుతూ మందు ఒలకబోస్తూ నానా యాగీ చేసినప్పుడు ఆర్జీవీ కొన్నిటిని పబ్లిసిటీ స్టంట్ కోసం అనుసరిస్తుంటారని గుసగుసలు వినిపించాయి. కథానాయికలతో ఆర్జీవీ సాన్నిహిత్యానికి సంబంధించిన ఫోటోలు ఇప్పటికే ఇంటర్నెట్ లో వైరల్ అయ్యాయి. ఇంతకుముందు బిగ్ బాస్ బ్యూటీ, తెలుగమ్మాయి అషురెడ్డితో ఇంటర్వ్యూ పేరుతో ఆర్జీవీ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. అతడి ప్రభావంతో అషుకి అవకాశాలొచ్చాయా లేదా? అన్నది అటుంచితే నాటి బోల్డ్ ఇంటర్వ్యూ చాలా కాలం పాటు యువతరంలో వాడి వేడి డిబేట్ కి తెర తీసింది. ఇప్పుడు తన `వ్యూహం` కథానాయికతో ఆర్జీవీ మరోసారి చెలరేగిపోయాడు. నైట్ పార్టీలో కాస్త ఒళ్లు మరిచి సదరు భామతో సన్నిహితంగా వ్యవహరిస్తూ నానా యాగీ చేసాడు. అందుకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు ఇంటర్నెట్ ని షేక్ చేస్తున్నాయి. మందు గ్లాసుతో ఓచోట .. సిగరెట్ వెలిగించి ఇంకో చోట.. ఆమెపై చేయి వేసి .. ఎర్రబారిన కళ్లతో హావభావాలు ప్రదర్శిస్తూ ఆర్జీవీ కనిపించాడు. ప్రస్తుతం ఈ ఫోటోలు అంతర్జాలంలో వైరల్ గా మారుతున్నాయి. ఇకనైనా ఆర్జీవీ ఈ వేషాలు కట్టిపెట్టి నాణ్యమైన సినిమాలు తీయడంపై దృష్టిప ఎట్టాలని కొందరు నెటిజన్లు ఆర్జీవికి తిట్ల ట్వీట్లు పెడుతున్నారు.