ఏపీలో పదో పరీక్షలకు హాల్ టికెట్లు విడుదల

ఏపీలో పదో పరీక్షలకు సంబంధించి హాల్ టికెట్లు విడుదలయ్యాయి. ప్రభుత్వ వెబ్ సైట్లో హాల్ టికెట్లు, విద్యార్థుల నామినల్ రోల్స్ పెట్టామని… వాటిని డౌన్ లోడ్ చేసుకోవాలని ప్రభుత్వ పరీక్షల విభాగం కార్యదర్శి దేవానందరెడ్డి తెలిపారు. హాల్ టికెట్లపై ప్రధానోపాధ్యాయులు సంతకం చేసి విద్యార్థులకు ఇవ్వాలని సూచించారు. విద్యార్థుల ఫొటోలు సరిగా లేకపోతే సరైన ఫొటోలను అతికించి, సంతకాలు చేసి ఇవ్వాలని తెలిపారు. ఏపీలో పదో తరగతి పరీక్షలు ఈ నెల 27న ప్రారంభం కానున్నాయి.

పదో తరగతి పరీక్షల తేదీలు:
ఏప్రిల్‌ 27 – తెలుగు
ఏప్రిల్‌ 28 – సెకండ్‌ లాంగ్వేజ్‌
ఏప్రిల్‌ 29 – ఇంగ్లీష్‌
మే 2 – గణితం
మే 4 – సైన్స్‌ పేపర్‌-1
మే 5 – సైన్స్‌ పేపర్‌-2
మే 6 – సోషల్