నరసరావుపేట కౌంటింగ్‌ పరిసరాల్లో ఆంక్షలు

నరసరావుపేట: జేఎన్‌టీయూ కౌంటింగ్‌ కేంద్రం పరిసరాల్లో పోలీసులు ఆంక్షలు విధించారు. జూన్‌ 4న కఠిన ఆంక్షలు అమలుచేస్తామని ఎస్పీ మల్లికాగార్గ్‌ తెలిపారు. కౌంటింగ్‌ కేంద్రం చుట్టుపక్కల డ్రోన్స్‌ ఎగరవేయడానికి అనుమతి లేదని, అనుమతి లేనిదే చుట్టుపక్కల తిరగరాదని సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.