మల్లువుడ్ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ నటించిన తాజా చిత్రం మల్లైకొట్టైవాలిబన్. తెలుగు వెర్షన్ కూడా మేకర్స్ ప్లాన్ చేసినప్పటికీ థియేటర్ల సమస్య రావడంతో ప్రస్తుతానికి డబ్బింగును రిలీజ్ చేయలేదు. లేట్ అయినా పర్వాలేదని భావించారు. ఇక ఈ సినిమా రిలీజ్ ముందు బాహుబలి రేంజ్ లో దీనికిచ్చిన బిల్డప్ అంతా ఇంతా కాదు. మల్లువుడ్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో తీసినట్టు అక్కడి మీడియా వర్గాలు తెగ ఉటంకించాయి. తీరా చూస్తే ఈ మలైకోట్టై వాలిబన్ డిజాస్టర్ దిశగా వెళ్తోంది.
రివ్యూలు చూస్తుంటే ఒక్కో రివ్యూలో ప్రేక్షకులు ఉతికి ఆరేస్తున్నారు. అద్భుతమైన ఆర్ట్ వర్క్, కోట్ల రూపాయల ఖర్చు, కళ్ళు చెదిరే సాంకేతిక నిపుణుల పనితనం ఇవన్నీ నాసిరకం రైటింగ్ తో పాటు తీసికట్టు దర్శకత్వంతో వృథా అయ్యాయని విరుచుకుపడ్డారు. ఉత్త హైప్ తప్ప ఏమీ కనిపించడం లేదని మండిపడుతున్నారు. అయినా ఈ మధ్య కాలం సినిమాల్లో ఇది బాగా ఫ్యాషన్ అయిపోయింది. సినిమాల్లో స్టఫ్ ఉన్నా లేకున్నా హైప్ క్రియేట్ చేసేసి కలెక్షన్లు రాబట్టుకుంటున్నారు. మొదటి రోజు పదిహేను కోట్ల దాకా రాబట్టినా తరువాత నేషనల్ హాలిడేకి దాన్ని నిలబెట్టుకోలేక విపరీతంగా డ్రాప్ అయ్యింది. ఇంతకు మందు మనదగ్గర మరక్కార్ అరేబియా సముద్ర సింహం సైతం ఇదే ఫలితాన్ని అందుకుంది కానీ కనీసం అది కేరళలో బాగానే ఆడిన లిస్టులోకి చేరింది.
దీనికంతా బాద్యుడిగా దర్శకుడు లిజో జోస్ పెల్లిషెర్రీ పేరు వినిపిస్తోంది. విశ్లేషకులు. బాహుబలి లాగా తీయాలనే ఆలోచన రాగానే సరిపోదని కథా కథనాలు, ఎమోషన్లు కూడా అదే స్థాయిలో ఉన్నాయో లేదో స్క్రిప్ట్ దశలోనే చెక్ చేసుకోవాలని తలంటుతున్నారు. అయినా సరే రాజమౌళి రేంజ్‌లో ఆలోచించడం కొంచం కష్టమే అనుకోండి. అయితే మోహన్ లాల్ మాత్రం ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. ఇంత వయసు మీద పడ్డా దేహ దారుఢ్యాన్ని పెంచుకుని రిస్క్ అనిపించే ఎన్నో యాక్షన్ స్టంట్స్ చేశారు. ఎంత రిస్క్ చేసినా లాభం లేకుండా పోయింది.