బిగ్ బాస్ ఫేమ్ అభిజీత్ నటించిన వెబ్ సిరీస్ “మిస్ పర్ఫెక్ట్”. ఈ వెబ్ సిరీస్ లో లావణ్య త్రిపాఠీ హీరోయిన్ గా నటించింది. అభిజ్ఞ ఉతలూరు మరో కీ రోల్ చేసింది. “మిస్ పర్ఫెక్ట్” వెబ్ సిరీస్ ను అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై సుప్రియ యార్లగడ్డ నిర్మించారు. విశ్వక్ ఖండేరావ్ దర్శకత్వం వహించారు. ఫిబ్రవరి 2వ తేదీ నుంచి డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ లో “మిస్ పర్ఫెక్ట్” స్ట్రీమింగ్ కు రెడీ అవుతోంది. ఈ సందర్భంగా ఈ సిరీస్ హైలైట్స్ వివరించారు హీరో అభిజీత్. “మిస్ పర్ఫెక్ట్” వెబ్ సిరీస్ లో నేను రోహిత్ అనే క్యారెక్టర్ లో నటిస్తున్నాను. చాలా లేజీ పర్సన్ గా కనిపిస్తా. జీవితంలో ఎలాంటి లక్ష్యమంటూ ఉండదు. ఏదో డబ్బు కోసం ఉద్యోగం చేస్తుంటాడు గానీ అదీ సీరియస్ గా తీసుకోడు. రోహిత్ కు ఇష్టమైన విషయం ఒక్కటే వంట చేయడం. అది మాత్రం శ్రద్ధగా చేస్తుంటాడు. నా రియల్ లైఫ్ లో రోహిత్ లాంటి క్యారెక్టర్స్ ను చాలామందిని చూశాను. నా ఫ్రెండ్స్ కూడా అలాంటి వాళ్లు ఉన్నారు. ఉద్యోగంలో ఇష్టంతో ఉండలేక…బయటకు వచ్చి బిజినెస్ తో రిస్క్ చేయలేక ఆ సంఘర్షణలో ఉండిపోతారు. ఎవరైనా ఉద్యోగం కాదని వేరే పనిచేయాలనుకుంటే అది 30-35 ఇయర్స్ లోనే చేయాలి. 40 దాటిన తర్వాత మీరు రిస్క్ చేయాలన్నా చేయలేరు. అప్పుడు ఇంకా బాధ్యతలు పెరిగిపోతాయి. నా రియల్ లైఫ్ లో రోహిత్ తో కొంత పోల్చుకుంటా గానీ యాక్టర్ గా నా కెరీర్ విషయంలో మాత్రం సీరియస్ గానే ఉన్నా. మా అమ్మ పెళ్లి చేసుకోమని పోరు పెడుతుంటుంది. లైఫ్ లో చాలా సెలెక్టివ్ గా ఉంటా. అంది కూడా నాకు కొద్దిగా మైనస్ అవుతోంది. ఇంత సెలెక్టివ్ గా ఉండటం అవసరం లేదేమో. ఈ మధ్య పెళ్లి గోల, మోడరన్ లవ్ అనే సిరీస్ లు చేశాను. ఆ తర్వాత నటించిన వెబ్ సిరీస్ ఇదే. “మిస్ పర్ఫెక్ట్” అనేది రొమాంటిక్ కామెడీ సిరీస్. ఏదైనా కథ విన్నప్పుడు నేను చేయగలనా, నాకు సెట్ అవుతుందా అనేది ఆలోచిస్తా. మనకు నచ్చనివి చేసి రిలీజ్ చేయడం ఈజీ. కానీ ఆడియెన్స్ కు నచ్చదు. వాళ్లు ఏదో చేసేస్తే చూసే ట్రెండ్ ఇప్పుడు లేదు. మనకు సెట్ అయ్యే మూవీ , క్యారెక్టర్ చేస్తేనే ఆదరిస్తున్నారు. బయటి వాళ్లకు నేను బాగా సెలెక్టివ్ అనుకున్నా సరే వచ్చిన అవకాశాలన్నీ ఒప్పుకోవడం లేదు. ఫిలింమేకర్స్ గా, యాక్టర్స్ గా మేము ముందు ఆ కథను పూర్తిగా నమ్మాలి. కన్విక్షన్ తో రూపొందించాలి. బ్యాడ్ కంటెంట్ ను ఆడియెన్స్ ఇష్టపడే పరిస్థితి ఇప్పుడు ఏమాత్రం లేదు.