Mahanaadu-Logo-PNG-Large

రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్ “రాజుగారి అమ్మాయి.. నాయుడుగారి అబ్బాయి”

వెంకట శివ సాయి పిల్మ్స్ పతాకంపై మణికొండ రంజిత్ సమర్పణలో సత్యరాజ్ ను దర్శకుడిగా పరిచయం చేస్తూ.. ముత్యాల రామదాసు గారు మరియు నున్నా కుమారి గారు సంయుక్తంగా నిర్మించిన చిత్రం “రాజుగారి అమ్మాయి.. నాయుడుగారి అబ్బాయి”. నూతన తారలు రవితేజ నున్నా హీరోగా, నేహ జురెల్ హీరోయిన్ గా నటించారు. రామిశెట్టి వెంకట సుబ్బారావు, కలవకొలను సతీష్ సహ నిర్మాతలు.ఈ సినిమా మార్చి 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా మీడియాతో ముచ్చటించిన కథానాయకుడు రవితేజ ,దర్శకుడు సత్యరాజ్, చిత్ర విశేషాలను పంచుకున్నారు.

ఈ సినిమా చేసేటప్పుడు ఏమైనా ఇబ్బంది పడ్డారా?..
హీరో రవితేజ: రొమాంటిక్ సన్నివేశాల్లో కాస్త ఇబ్బందిపడ్డాను.
దర్శకుడు సత్య: కొంచెం కాదు చాలా ఇబ్బంది పడ్డాడు(నవ్వుతూ). హీరో, హీరోయిన్ మధ్య వచ్చే రొమాంటిక్ సాంగ్ బాగుంటుంది. ఆ సాంగ్ తరువాత హీరోయిన్ చనిపోవడం, ఆమె చివరిగా కలిసింది హీరోనే కావడంతో.. ఆమెను ఎవరు హత్య చేశారనే పాయింట్ తో ఎంతో ఇంటెన్స్ గా కథ నడుస్తుంది. రొమాన్స్ నుంచి ఒక్కసారిగా క్రైమ్ కి టర్న్ తీసుకుంటుంది.

మీరు నటనలో శిక్షణ ఏమైనా తీసుకున్నారా?
హీరో రవితేజ: నటనలో శిక్షణ అయితే ఏమీ తీసుకోలేదు. తమిళ సినిమా చేసినప్పుడు కూడా ప్రత్యేకంగా ఏమీ నేర్చుకోలేదు. స్వతహాగా నేర్చుకుంటూ, దర్శకుల సలహాలు పాటిస్తుంటాను. ఈ సినిమాలో దర్శకుడు సత్య నా నుంచి ఆయనకు కావాల్సిన నటనను బాగా రాబట్టుకున్నారు.

హీరో నటన పట్ల మీరు సంతృప్తి చెందారా?
దర్శకుడు సత్య: నూటికి నూరు శాతం నేను సంతృప్తి చెందాను. రామదాసు గారు కూడా రష్ లో అతని నటన, మా మేకింగ్ చూసే.. ఈ సినిమాకి సపోర్ట్ చేయడానికి ముందుకు వచ్చారు.

ఈ చిత్రం ప్రేమ కథతో కూడిన క్రైమ్ థ్రిల్లర్ :దర్శకుడు సత్య రాజ్

ఇది కులాల నేపథ్యంలో తీసిన సినిమానా? టైటిల్ అలా పెట్టడానికి కారణమేంటి?
దర్శకుడు సత్య: సినిమాలోని రెండు పాత్రలను ఆధారం చేసుకుని ఈ టైటిల్ పెట్టడం జరిగింది. రెండు కుటుంబాల మధ్య జరిగే ఇంటెన్స్ స్టోరీ ఇది. ఎక్కడా కులాల ప్రస్తావన ఉండదు. ఈ సినిమా కథ ఎంత కొత్తగా ఉండబోతుంది అనేది మీకు స్క్రీన్ మీద చూస్తే అర్థమవుతుంది.

క్రైమ్ థ్రిల్లర్ జానర్ ను ఇష్టపడేవారు ఎందరో ఉంటారు. మరి మీరు ప్రమోషన్స్ లో ఇది క్రైమ్ థ్రిల్లర్ సినిమా అని ఎందుకు చెప్పడంలేదు?
దర్శకుడు సత్య: టైటిల్, పోస్టర్ల వల్ల మాత్రమే ఇది ప్రేమ కథా చిత్రం అనే భావన కలుగుతుంది. కానీ టీజర్, ట్రైలర్ చూస్తే ఇది క్రైమ్ థ్రిల్లర్ సినిమా అని అర్థమైపోతుంది. కథలో పెద్ద ట్విస్ట్ ఉంటుంది. అది ప్రచార చిత్రాల్లో ఎక్కడా రివీల్ కాకుండా జాగ్రత్త పడుతున్నాం. అది స్క్రీన్ మీదే ఆడియన్స్ కి పెద్ద సర్ ప్రైజ్ లా ఉండాలని ప్లాన్ చేస్తున్నాం. ఇప్పటివరకు ప్రచార చిత్రాల్లో ఎక్కడా చూపించని ఒక పాత్ర సినిమాలో ఉంటుంది. సినిమా చూసినప్పుడు మీకు అది సర్ ప్రైజ్ ఇస్తుంది.