అందుకే చంద్రబాబుపై తప్పుడు ఫిర్యాదు
దమ్ముంటే ఒక్క ఆధారం చూపాలి
జూన్ 4న మీ కూలి, నీలి మీడియా ఖతం
అబద్ధాల రోత పత్రిక సాక్షి పనిచూస్తాం
టీడీపీ అధికార ప్రతినిధి సయ్యద్ రఫీ
మంగళగిరి: సజ్జలకు అరెస్టు భయం పట్టుకుందని, అందుకే చంద్రబాబుపై తప్పుడు ఫిర్యాదు చేయించారని టీడీపీ అధికార ప్రతినిధి సయ్యద్ రఫీ వ్యాఖ్యా నించారు. మంగళగిరి కేంద్ర కార్యాలయంలో ఆదివారం విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ హైకోర్టు న్యాయవాది చిట్టం వెంకటరెడ్డి వైసీపీ నాయకుడని, మే 31న టీడీపీ జాతీయ కార్యాలయంలో చీఫ్ ఏజెంట్లకు శిక్షణలో వైసీపీ ఏజెంట్లను బెదిరించాలని చంద్రబాబు అన్నట్లు తాడేపల్లి పోలీసుస్టేషన్‌లో ఫిర్యా దు చేశారన్నారు. చంద్రబాబు ఆ మీటింగ్‌లో లేకపోయినా ఉన్నట్లు తప్పుడు ఫిర్యాదు చేశారు. దాని ఆధారంగా సాక్షి పత్రిక పెద్ద అక్షరాలతో రాసింది. అసలు రెచ్చగొట్టింది సజ్జల రామకృష్ణారెడ్డి..సాక్ష్యాలు కూడా ఇచ్చాం. జూన్ 4న ప్రభు త్వం మారబోతోంది.. మొదటి అరెస్టు బహుశా సజ్జలకే ఉండచ్చేమోనని వణుకు మొదలైందని పేర్కొన్నారు. ఈ వార్త మీద ప్రెస్ కౌన్సిల్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. అవినీతి పుత్రిక సాక్షి కథ తేలుస్తాం..సాక్షికి ఎన్ని వేల కోట్ల రూపాయల యాడ్స్ ఇచ్చారు? వాలంటీర్లకు సాక్షి పేపర్ ఎలా ప్రభుత్వ డబ్బులతో పంపారు? అన్నది ఢల్లీి కోర్టులో కేసు నడుస్తోంది..దానిపై జడ్జిమెంట్ కూడా వచ్చింది. ఇవన్నీ కూడా లాగుతాం.. వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు.
పరువు నష్టం దావా వేస్తాం
చేతిలో పేపర్ ఉంది, లాయర్లు ఉన్నారు కదా అని తప్పుడు కేసులు పెడితే పరువు నష్టం దావా వేస్తామని తెలిపారు. చంద్రబాబును వెంటనే అరెస్టు చేయాలని రాసి నందుకు చిట్టం వెంకట్ రెడ్డిని, పేపర్ ఎడిటర్, చైర్మన్‌ను అందరినీ లాగుతామని చెప్పారు. చంద్రబాబును అరెస్టు చేయడానికి ఆయన చేసిన తప్పేంటి? కౌంటింగ్ నిలిచిపోయేలాగా పని చేయాలని చంద్రబాబు చెప్పినట్లు రాశారు. వైసీపీ ఏజెంట్లు భయపడిపోవాలి అని చెప్పినట్లు తప్పుడు కథనం రాశారు. ఈ చిట్టం వెంకట్‌రెడ్డి, సజ్జల బెంచీల కింద దాక్కొని విన్నారా? ఈ ఐదేళ్లలో వైసీపీ నాయకులు చేసిన దౌర్జన్యాలు, దాడులు, హత్యలు అన్నీ ఇన్నీ కావు. ఇప్పటికే చాలామంది విశాఖప ట్నం, విజయనగరం వైసీపీ నాయకులు కలకత్తా, భువనేశ్వర్ పారిపోతున్నారు. మరికొంతమంది విజయవాడ, గుంటూరు వాసులు హైదరాబాద్‌కు పారిపోతు న్నారు. సజ్జల ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించిన తీరును ఆధారాలతో సహా ఫిర్యాదు చేశాం. దమ్ముంటే చంద్రబాబు మాట్లాడినట్లు ఒక్క ఆధారం చూపాలని సవాల్ విసిరారు. మీ కూలి, నీలి మీడియా పని 4వ తేదీతో ఖతం. ఈ అబద్ధాల సాక్షి రోత పత్రిక పనిచూస్తామని హెచ్చరించారు.