Mahanaadu-Logo-PNG-Large

అన్ని వర్గాల వారిని ఆకట్టుకునే మంచి సందేశాత్మక చిత్రం.. ‘భారతీయుడు 2’

యూనివ‌ర్స‌ల్ స్టార్ క‌మ‌ల్ హాస‌న్‌, సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ శంక‌ర్ కాంబినేష‌న్‌లో అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడ‌క్ష‌న్స్ తో పాటు ప్రముఖ నిర్మాణ సంస్థ రెడ్ జెయింట్ బ్యానర్‌పై సుభాస్క‌ర‌న్ నిర్మించిన భారీ బ‌డ్జెట్ చిత్రం ‘భార‌తీయుడు 2’. ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో జులై 12న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ మూవీ తెలుగు థియేట్రికల్ హక్కులను ఏషియ‌న్ సురేష్ ఎంట‌ర్‌టైన్మెంట్స్ ఎల్ఎల్‌పి, సీడెడ్ హ‌క్కుల‌ను శ్రీల‌క్ష్మి మూవీస్ సంస్థ‌లు ద‌క్కించుకున్నాయి. ఇక ఈ మూవీ విశేషాలను పంచుకునేందుకు చిత్రయూనిట్ సోమవారం నాడు ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ మీడియా సమావేశంలో.. కమల్ హాసన్ మాట్లాడుతూ.. ‘తెలుగు ప్రేక్షకులే నన్ను స్టార్‌ను చేశారు. తెలుగులోనే నాకు క్లాసిక్ హిట్స్ ఉన్నాయి. భారతీయుడు 2లో సేనాపతి చెప్పే డైలాగ్స్ అన్నీ కూడా సమాజంలోంచి వచ్చినట్టే ఉంటాయి. రెండు వేళ్లు మడత పెట్టడం అంటే.. ఒకటి ఓటు వేసేది.. రెండోది మన బాధ్యతది చెప్పేది. సాంగ్, ఫైట్స్ ఉన్నాయా? అని డిస్ట్రిబ్యూటర్లు అడుగుతుంటారు. అవన్నీ ఇందులో ఉంటాయి. కానీ డిఫరెంట్‌గా ఉంటాయి. నేను గురువు అని సిద్దార్థ్ ప్రతీ సారి చెబుతుంటాడు. అవే మాటలు నేను శివాజీ గణేశన్ గారికి చెబుతుండేవాడిని. సిద్దార్థ్, నేను ఒక ఏకలవ్య శిష్యులం. ఇంకా కమల్ హాసన్ లాంటి వారు రావాలి.. సిద్దార్థ్ లాంటి వారు వస్తూ ఉండాలి. ఇండస్ట్రీకి ఎంతో కొంత తిరిగి ఇవ్వాలి. భారతీయుడు 2 చిత్రాన్ని అందరూ వీక్షించండి. ఈ సినిమాలోని మెసెజ్ అందరికీ చేరాలి. అందుకోసం మీడియా మాకు సహకరించాలి. ఈ సినిమాను జనాల వరకు తీసుకెళ్లండి. జూలై 12న మా చిత్రాన్ని థియేటర్లో చూడండి’ అని అన్నారు.