పారిశుద్ధ్య పనులు ప్రారంభించాలి

– ఎమ్మెల్యే ఆనందబాబు

కొల్లూరు, మహానాడు: కొల్లూరు మండలం వరద ప్రభావిత గ్రామాలు ఆవులవారిపాలెం, గాజుల్లాంక, పెసర్లంక గ్రామాల లో బాపట్ల కలెక్టర్ వెంకట మురళీతో కలిసి మాజీ మంత్రి వేమూరు శాసనసభ్యుడు నక్కా ఆనందబాబు బుధవారం పర్యటించారు. ఇంటింటికి వెళ్లి వారి కి అందుతున్న సహాయ కార్యక్రమం గురించి తెలుసుకున్నారు. అలాగే గ్రామాల్లో పారిశుద్ధ్య పనులు వెంటనే చేయాలని, గ్రామాల్లో మెడికల్ క్యాంపులు కంటిన్యూ చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజలు అధైర్య పడకుండా ధైర్యంగా ఉండాలని, ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటుందని భరోసా కల్పించారు. అలాగే అరవింద వారధిపై రాకపోకలకు అంతరాయంగా ఉన్న చెత్తను ప్రొక్లయినర్‌ సహాయంతో క్లియర్ చేసే పనులను దగ్గర ఉండి పర్యవేక్షించారు.