సంజన అన్నే దర్శకత్వంలో క్రైమ్ రీల్

అన్నే క్రియేషన్స్ బ్యానర్ పై సంజన అన్నే దర్శకత్వం వహిస్తున్న సినిమా క్రైమ్ రీల్. పలు సినిమాల్లో హీరోయిన్ గా నటించిన సంజన అన్నే ఈ సినిమాతో దర్శకురాలిగా మారడం విశేషం. ఇటీవల ఈ చిత్ర పోస్టర్ ను సినిమాటోగ్రఫీ మినిష్టర్ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి విడుదల చేశారు. ఇటీవల విడుదలైన క్రైమ్ రీల్ మూవీ పోస్టర్ కు విశేష స్పందన లభించింది. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ డబ్బింగ్ వర్క్స్ స్టార్ట్ అయ్యాయి. త్వరలో ఈ సినిమా టీజర్ ను యూనిట్ విడుదల చేయనున్నారు.
సిరి చౌదరి, పింక్ పాక్ సూర్య, జబర్దస్త్ అభి, భారత్ ప్రధాన పాత్రలో తెరకెక్కబోతున్న ఈ సినిమా సీట్ ఎడ్జె థ్రిల్లర్ గా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది, బాబు కొల్లాబత్తుల సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ సినిమాకు సాగర్ ఉదగండ్ల ఎడిటర్ గా వర్క్ చేస్తున్నారు. రచన, దర్శకత్వం సంజన అన్నే గా వ్యవహరిస్తున్నారు.