ఓ రకం పాత్రలకు
పెట్టింది పేరు..
జగ్గయ్య టైపు…
మనిషేమో అందగాడు..
హీరోయిన్లను ప్రియులకు
అప్పజెప్పేసే త్యాగధనుడు
బాలచందర్
బడి నుంచి వచ్చిన
మరో విద్యార్థి
అప్పుడప్పుడు
హీరోలకు ప్రత్యర్థి..
వెండితెరపై శరత్ కాలం..
రమాప్రభతో మాత్రం
సాగలేదు కలకాలం..!
సత్యంబాబు దీక్షిత్..
శరత్ బాబుగా మారి
మొదట్లో ఆకట్టుకొలేకపోయాడు
కించిత్..
రామాలయంలో సావిత్రి
చెంప దెబ్బకు తేరుకుని
బాలచందర్ నీడకు చేరుకుని
అప్పుడయ్యాడు
మంచి నటుడు
ఆప్తుడయ్యాడు అందరికీ
ఈ విలక్షణుడు..
హీరోగా ఫెయిలయ్యి
సపోర్టింగ్ గా హిట్టయ్యాడు..
గుప్పెడంత మనసు
త్యాగం చెయ్యడమే తెలుసు..
అలాంటి పాత్రల్లోనే “అభినందన”లు..
ఆయనతో స్నేహం సాగరసంగమం..
రూపేమో అప్పుడే అరవిచ్చిన స్వాతిముత్యం..
గొంతు గంభీరం
ఆ స్వరంతోనే
ఇప్పుడు జనాలకి
నువ్వు కావాలి అంటూ
నిన్నమొన్న తగ్గించాడు
వకీల్ సాబ్ ఆవేశం
ఆ సినిమాలో
చిన్నదైనా మంచి వేషం..
ఆయన కనిపించిందే
కీలక సన్నివేశం..!
ముఖం వడలినా
తగ్గని వర్చస్సు..
రామదాసులో చేసిన తపస్సు
సినిమాలు వదలకుండా
కాపాడుకుంటూ వస్తున్న యశస్సు..
నూరేళ్ళు వర్ధిల్లాలి
ఈ ఆమదాలవలస ఆపద్భాందవుడు..!
ఎలిశెట్టి సురేష్ కుమార్
9948546286