Mahanaadu-Logo-PNG-Large

సీక్వెల్‌ కంటే ముందే ప్లానింగా?

`టైగ‌ర్ వ‌ర్సెస్ ప‌ఠాన్` కి స‌న్నాహాలు జ‌రుగుతోన్న విషయం తెలిసిందే. స‌ల్మాన్ ఖాన్..షారుక్ ఖాన్ ని ఒకే ప్రేమ్ లో చూపిస్తూ అద్భుత‌మైన స్పై చిత్రంగా దీన్ని మ‌ల‌చ‌డానికి య‌శ్ రాజ్ ఫిలింస్ భారీ ఎత్తున స‌న్నాహాలు చేస్తుంది. ఇక ఈ చిత్రం కోసం టాప్ టెక్నీషియ‌న్ల‌ను రంగంలోకి దించి ఓరేంజ్ లో మార్కెట్ లోకి వ‌ద‌లాల‌ని నిర్మాతల ఆలోచన. ఇప్ప‌టికే ఆ సినిమా కి సంబంధించిన ప‌నులు ప్రారంభమ‌య్యాయి. సల్మాన్..షారుక్ ఖాన్ వీలును బ‌ట్టి చిత్రాన్ని వీలైనంత వేగంగా సెట్స్ పైకి తీసుకెళ్ళే ప్రణాళికలు మొదలయ్యాయి. అయితే తాజా స‌మాచారం ప్ర‌కారం `టైగ‌ర్ వ‌ర్సెస్ ప‌ఠాన్` కంటే ముందుగా ప‌ఠాన్ -2 ని ప‌ట్టాలెక్కించాల‌ని య‌శ్ రాజ్ ఫిలింస్ నిర్ణ‌యం మార్చుకున్న‌ట్లు స‌మాచారం. షారుక్ ఖాన్ క‌థానాయ‌కుడిగా న‌టించిన `ప‌ఠాన్` బాక్సాఫీస్ ని ఏ రేంజ్ లో షేక్ చేసిందో అందరికీ తెలిసిందే. బాక్సాఫీస్‌ కలెక్షన్లను కొల్లగొట్టింది.1000 కోట్ల‌కు పైగా వ‌సూళ్లు సాధించ‌డంతో ఈ సినిమాకి సీక్వెల్ కూడా ఉంటుంద‌ని కొన్ని రోజులుగా ప్రచారం సాగింది. సిద్దార్ధ్ ఆనంద్ అదే టీమ్ తో `ప‌ఠాన్ 2`ని ప్రారంభించాల‌ని ప్లాన్ చేస్తున్న‌ట్లు బాలీవుడ్ మీడియాలో పుకార్లు షికారు చేస్తుంది. మ‌రో సాలిడ్ అప్ డేట్ ఏమిటంటే… ఈ సీక్వెల్ ని య‌శ్ రాజ్ ఫిలింస్ `టైగ‌ర్ వ‌ర్సెస్ ప‌ఠాన్` కంటే ముందుగానే ప్రారంభించాల‌ని భావిస్తోందిట‌. ఇప్పటికే ఇందుకు సంబంధించిన పనులను కూడా యశ్‌రాజ్‌ ఫిల్మ్స్‌ ప్రారంభించింద‌ని స‌మాచారం. అన్నీ అనుకున్న‌ట్లు జ‌రిగితే గ‌నుక ఈ ఏడాది చివరి నాటికి సెట్స్‌పైకి వెళ్లనుందని వినిపిస్తుంది. యశ్‌ రాజ్‌ స్పై యూనివర్స్ లో ఇదొక కీలక చిత్రంగా నిలవనుందని అంటున్నారు. ఈ సినిమా కోసం స‌ద‌రు నిర్మాణ సంస్థ 500 కోట్లు ఖ‌ర్చు చేయ‌బోతుంద‌ని బాలీవుడ్ మీడియాలో ప్ర‌చారం సాగుతోంది.
ఇక ఎన్ని కోట్లు ఖర్చుపెడుతున్నాం అన్న విషయం పక్కన పెడితే కథలో కంటెంట్‌ ఉన్నా లేకున్నా కొన్ని చిత్రాలు స్టార్‌ హీరోల వల్ల మంచి ఓపెనింగ్స్‌ వచ్చి కలెక్షన్లకు ఎటువంటి ఢోకాలేకుండా అయిపోతుంది. అయితే అదే హిట్‌ కొడితే మాత్రం కలెక్షన్లు మాత్రమే కాదు ఆ స్టార్లకి కూడా మంచి పేరు వచ్చి తిరిగి మళ్ళీ అదే చిత్రానికి సంబంధించిన సీక్వెల్స్‌.. ఫ్రాంచైజీల కోసం ప్రేక్షకులు ఎదురు చూస్తారు.