గద్వాల జిల్లా గట్టు మండలం ఇందువాసి గ్రామం లో శనివారం తెల్లవారుజామున దారుణం జరిగింది. ఆస్తి పంపకం విషయంలో తండ్రి ఊరకుందు (48) ను ఆయన కుమారుడు వీరేష్ గొడ్డలితో నరికి చంపాడు. తాగుడుకు బానిసైన తండ్రి గ్రామ సమీపంలోని ఆలయంలో నిద్రిస్తున్న తండ్రిపై దాడి చేసి హతమార్చాడు. ఈ సంఘటన నడిగడ్డలో చర్చనీయాంశమైంది. ఈ విషయమై గట్టు పోలీసులు విచారణ చేస్తున్నారు.