గత ఏడాది బలగం వంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ చిత్రాన్ని నిర్మించిన ప్రెస్టీజియస్ బ్యానర్ దిల్‌రాజు ప్రొడక్షన్స్ ఇప్పుడు క్రేజీ చిత్రాలను నిర్మిస్తోన్న సంగతి తెలిసిందే. కొత్త టాలెంట్‌ను ఎంకరేజ్ చేస్తూ సినిమాలను రూపొందిస్తోన్న ఈ నిర్మాణ సంస్థలో డిపరెంట్ రోల్స్‌తో మెప్పిస్తూ వెర్సటైల్ యాక్టర్‌గా పేరు తెచ్చుకున్న సుహాస్ హీరోగా ఓ సినిమాను నిర్మిస్తున్నారు. దిల్‌రాజు ప్రొడక్షన్ బ్యానర్‌లో ప్రొడక్షన్ నెం.4గా గత ఏడాది డిసెంబర్‌లో ఈ చిత్రం లాంఛనంగా ప్రారంభమైంది.
సుహాస్ జతగా సంకీర్తన విపిన్ నటిస్తుంది. నిర్మాత శిరీష్ సమర్పణలో హర్షిత్ రెడ్డి, హన్షితా రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సలార్ చిత్రానికి డైలాగ్ రైటర్‌గా వర్క్ చేసిన సందీప్ రెడ్డి బండ్ల ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు. లేటెస్ట్‌గా చిత్ర యూనిట్ ఈ సినిమా రిలీజ్ డేట్‌ను ప్రకటించింది. `అందరూ మెచ్చే వినోదం ప్రారంభం అవుతుంది. మీ క్యాలెండర్‌లో మే 24ని గుర్తు పెట్టుకోండి. దిల్‌రాజు ప్రొడక్షన్స్ బ్యానర్స్ లో నాలుగో చిత్రంలో నేను నటిస్తున్నాను. మేం అద్భుతమైన కామెడీతో వేడి పుట్టించటానికి సిద్ధంగా ఉన్నాం` అని సుహాస్ పేర్కొన్నారు.
ఈ చిత్రం మే 24న థియేటర్స్‌లో గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. దీనికి సంబంధించిన పోస్టర్‌ను చిత్ర యూనిట్ విడుదల చసింది. అందులో చిన్న పాట మహిళ న్యాయమూర్తిగా కనిపిస్తోంది. చిన్నారి కళ్లకు గంతలు కట్టుకుని ఒక చేతిలో రెండు ట్రే స్కేల్ పట్టుకొని కనిపించింది. పోస్టర్ చూస్తుంటే ఈ సినిమా ఫ్యామిలీ ఎమోషన్స్ ఉన్న ఒక ఫన్నీ కోర్టు డ్రామా అని అర్థమవుతుంది. #JAGonMay24 అనే హ్యాష్ ట్యాగ్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. త్వరలోనే టైటిల్‌ను ప్రకటిస్తామని నిర్మాతలు ప్రకటించారు.
ఈ చిత్రానికి సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. బేబి వంటి బ్లాక్‌బస్టర్ చిత్రానికి సంగీతాన్ని అందించిన విజయ్ బుల్గానిన్ ఈ చిత్రానికి సంగీత సారథ్యం వహిస్తున్నారు. బలగం వంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత దిల్‌రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ ఆకాశం దాటి వస్తావా సినిమాను రూపొందిస్తోంది. అలాగే ఇటీవల ఈ బ్యానర్ ఆశిష్ హీరోగా మూడో ప్రాజెక్ట్‌ను కూడా అనౌన్స్ చేశారు. ఇప్పుడు సుహాస్ హీరోగా నాలుగో సినిమా సిద్ధమవుతుంది. త్వరలోనే మరిన్ని వివరాలను మేకర్స్ ప్రకటించనున్నారు.