టీడీపిరాష్ట్ర ఉపాధ్యక్షులు వై.వి.బి.రాజేంద్రప్రసాద్ ని కలిసిన యలమంచిలి సుజనా చౌదరి
ఉయ్యూరు లోని రాజేంద్రప్రసాద్ నివాసానికి కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి .. రాజేంద్రప్రసాద్ ని, ఇతర తెదేపా మరియు జనసేన నాయకులను మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది.

ఈ సందర్భంగా సుజనా చౌదరి మాట్లాడుతూ ఈరోజు రాజకీయాలకతీతంగా రాజేంద్రప్రసాద్ ఇంటికి రావడం జరిగిందని, రాజేంద్రప్రసాద్ తనకు సోదర సమానులని అన్నారు, అలాగే రాష్ట్ర ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని అన్నారు.

సగర సాధికార రాష్ట్ర కన్వీనర్ జంపన శ్రీనివాస్,మైనారిటీ సెల్ రాష్ట్ర కార్యదర్శి సయ్యద్ అజ్మతుల్లా (బాబు),జనసేన నాయకుడు సనకాకిరణ్, వల్లూరి కిరణ్,మైనారిటీ నాయకులు షఫివుల్లా బెగ్, చలపాటి శ్రీను,సలీం,సాయి,తదితరులు పాల్గొన్నారు