ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య
మహానాడు, చందర్లపాడు: చందర్లపాడు మండలం కోనయపాలెం గ్రామంలో పదవ తరగతిలో 400కు పైగా మార్కులు సాధించిన 21 మంది విద్యార్థులకు శ్రీ సాయి ఆరాధన క్షేత్రం షిరిడి, విజయవాడ వారి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య చేతులు మీదుగా స్కాలర్ షిప్పులను అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తల్లిదండ్రులు మనపై పెట్టుకున్న ఆశలను సాధించే దిశగా తల్లిదండ్రులకు మంచి పేరును తెచ్చే విధంగా ప్రతి ఒక్క విద్యార్థినీ విద్యార్థులు బాగా చదువుకోవాలన్నారు. కార్యక్రమంలో ట్రస్ట్ కోశాధికారి మహంకాళి మోహన్ రావు,మాజీ జెడ్పిటిసి సభ్యులు, స్థానిక ఎంపీటీసీ,సర్పంచ్,ఎన్డీఏ నేతలు, విద్యార్థినీ విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు