17 వ తేదీ వైద్య సేవల నిలిపివేత: ఐఎంఏ

  • కోల్ కత్తా లో జరిగిన వైద్యురాలి అత్యాచారం, హత్య కేసులో న్యాయం కోసం డిమాండ్
  • వైద్య సిబ్బంది కేంద్ర రక్షణ చట్టం చేయాలి
  • ఆంధ్రప్రదేశ్ వైద్య సిబ్బంది రక్షణ చట్టాన్ని సవరించి కఠిన తరం చేయాలి

కోల్ కతాలో ఆర్.జీ.కర్ ప్రభుత్వ కళాశాల ఆసుపత్రిలో ఆగస్టు 9వ తేదీ రాత్రి డ్యూటీలో ఉన్న మహిళా వైద్యురాలిపై అమానుషంగా సామూహిక అత్యాచారం చేసి పాశవికంగా హత్య చేసిన కేసులో సత్వర న్యాయం డిమాండ్ చేస్తూ, దానికి వ్యతిరేకంగా నిరసనలు తెలుపుతున్న ఆర్ జి కర్ వైద్య కళాశాల ఆసుపత్రి విద్యార్థులు, వైద్యులపై ఆగస్టు 14వ తేదీ రాత్రి రౌడీముకల దాడులను నిరసిస్తూ జాతీయ ఐఎంఏ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐఎంఏ శాఖలు 17వ తేదీన 24 గంటలపాటు వైద్య సేవలు నిలిపివేయాలని పిలుపునివ్వడం జరిగిందని, అందులో భాగంగా ( బ్రాంచి ఊరు పేరు)
కూడా శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు నగరంలోని/పట్టణంలోని అన్ని ప్రైవేటు ఆసుపత్రులలో, అత్యవసర సేవలు మినహాయించి, ఓపిడి సేవలు, అత్యవసరం కాని శస్త్ర చికిత్సలు పూర్తిస్థాయిలో నిలిపివేయడం జరుగుతుందని ఐఎంఏ ( బ్రాంచ్ పేరు) శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేసి,సిబిఐ ఆధ్వర్యంలో త్వరితగతిన నేర పరిశోధన పూర్తి చేసి,నేరానికి పాల్పడిన వారిపై కఠిన శిక్షలు పడేలా చూడాలని,ఆసుపత్రులలో డ్యూటీలో ఉన్న వైద్యులకు, వైద్య సిబ్బందికి తగిన రక్షణ కల్పించే వ్యవస్థను ఏర్పాటు చేయాలని, ప్రత్యేక రక్షణ చట్టాలు కేంద్ర స్థాయిలో తీసుకురావాలని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న వైద్య సిబ్బంది రక్షణ చట్టాన్ని సవరించి కఠిన తరం చేయాలని డిమాండ్ చేస్తున్నామని ఐఎంఏ శాఖ రాష్ట్ర అధ్యక్షుడు Dr జె సి నాయుడు కార్యదర్శి డిఆర్ ఫణిధర్ కోశాధికారీ డిఆర్ రవీంద్రనాథ్ ప్రకటనలో తెలిపారు.

ఈ నిరసన తర్వాత ప్రభుత్వాలు తీసుకునే చర్యలను బట్టి తదుపరి కార్యాచరణ ప్రకటించడం జరుగుతుందని, తమ డిమాండ్లు సాధించేవరకు ఈ ఉద్యమాన్ని ఆపేది లేదని, అవసరమైతే మరింత తీవ్రతరం చేస్తామని, వృత్తి నిర్వహణలో రక్షణ కల్పించమని అడుగుతున్న తమ న్యాయమైన డిమాండ్లకు ప్రజలు,ప్రజా సంఘాలు, అన్ని రాజకీయ పక్షాలు మద్దతు ఇవ్వాలని కోరారు.